"ఆర్ఆర్ఆర్" అంటూ దర్శక ధీరుడు రాజమౌళి ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో గానీ ఒక్కసారే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి అదే రేంజ్ లో "భీమ్ ఫర్ రామరాజు" అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజు గా చూపించి సంచలనం సృష్టించాడు. మరి ఇవాళ "రామరాజు ఫర్ భీమ్" అంటూ కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చూపించి అదరగొట్టాడు. అయితే ఆ విశేషాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. నేడు కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా "రామరాజు ఫర్ భీమ్" పేరుతో తారక్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ స్టన్నింగ్ విజువల్స్ కి చరణ్ వాయిస్ ఓవర్ తోడై ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో యూట్యూబ్ లో "రామరాజు ఫర్ భీమ్" రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన 7 నిమిషాల్లోనే 100K లైక్స్ సాధించిన టీజర్ గా రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించింది. మోస్ట్ అవైటెడ్ అండ్ పవర్ ఫుల్ టీజర్ గురించి సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రముఖ నటీ నటులు అందరూ ఈ టీజర్ పై స్పందించారు. 

హరీష్ శంకర్: "కొన్ని నెలలుగా అలుముకున్న నిరాశ నిస్పృహ దెబ్బకు పటాపంచలై.. అదే చోట ఆత్మస్థైర్యం.. ఆత్మ విశ్వాసం.. మీరు నిలబెట్టిన జెండాలా లేచి నిల్చున్నాయి''.

అనిల్ రావిపూడి: "స్టన్నింగ్ విజువల్స్.. ఎక్సెలెంట్ వాయిస్ ఓవర్.. స్మాషింగ్ టీజర్."

దేవి శ్రీ ప్రసాద్: "వావ్ వావ్ వావ్.. అమేజింగ్ బ్రదర్.. మైండ్ బ్లోయింగ్ ఇన్స్పైరింగ్ టీజర్".

రానా: "వైల్డ్ గా ఉన్నావ్ గురూ".

వరుణ్ తేజ్: "ఫెంటాస్టిక్.. భీకరంగా ఉన్నావ్".

సుధీర్ వర్మ: గూస్ బమ్స్ వచ్చాయి.

గోపీచంద్ మలినేని: టెర్రిఫిక్ టీజర్.

రాశి ఖన్నా: మాటల్లేవ్.

వీరితో పాటు డైరెక్టర్ బాబీ - మ్యూజిక్ డైరెక్టర్ థమన్ - రైటర్ వక్కంతం వంశీ - హీరోలు సుశాంత్ మరియు నారా రోహిత్ వంటి వారు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ పై స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: