సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల కొరత అనేది ఎక్కడ ఉండదు. స్టార్  హీరోలతో చేయడానికి చాలా మంది స్టార్ హీరోయిన్లు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మన తెలుగులో మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది.. తెలుగులో ఉన్న స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకడం అనేది చాలా ఇబ్బందిగా మారిందని కొందరు నిర్మాతలు దర్శకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు హీరోయిన్లు దొరకడం ఇప్పుడు ప్రధాన ఇబ్బందిగా మారింది అనే మాట అక్షరాలా నిజం. ప్రధానంగా బాలకృష్ణకు హీరోయిన్లను ఎంపిక చేయటం దర్శక నిర్మాతలకు చాలా కష్టంగా మారింది అని చెప్పాలి.

 ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాకు హీరోయిన్ ని ఎంపిక చేయడం దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఇబ్బంది గా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా స్నేహాని తీసుకునే అవకాశం ఉందని అన్నారు. అయితే ఆమె మరీ పెద్దది కావడంతో వెనక్కి తగ్గారని సమాచారం. ఇక ఈ సినిమాలో నయనతార ని కూడా తీసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని తెలిసింది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ అదృష్టాన్ని కూడా తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని తెలిసింది.

అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలో హీరోయిన్ గా రాధిక ఆప్టే ని ఎంపిక చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ హీరోయిన్ ఒకరిని తీసుకునే అవకాశం ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: