దర్శకుడు క‌ల్యాణ్ జీ గోగ‌న రూపొందిస్తున్న సుందరి సినిమా కు సంబంధించిన ప్రీ లుక్ ఈ రోజు విడుదల కాగా.. తెలుగు ప్రేక్షకుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఓ డాన్స్ కార్యక్రమంలో బుల్లితెర యాంకర్ ప్రదీప్ తో ఫేక్ లవ్ స్టోరీ నడుపుతున్న నటీమణి పూర్ణ.. అవును, అవును 2 సీమటపాకాయ్ వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 31 ఏళ్ల కేరళ భామ పూర్ణ మలయాళం తమిళం కన్నడ తెలుగు వంటి భాషా చిత్రాల్లో నటించే దక్షిణ భారతదేశంలో మంచి హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో ఒక దయ్యం పాత్రలో నటించిన ఈమె ఆ తర్వాత క్రమక్రమంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగారు. గత కొంతకాలంగా వ్యక్తిగత విషయాలతో బాధ పడుతున్న అన్నపూర్ణ సినిమా ఇండస్ట్రీకి కొంత కాలం బ్రేక్ ఇచ్చారు. అయితే ఇటీవలే ఆమె అన్ని వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టేసి సుందరి సినిమాలో నటించడానికి ఓకే చెప్పారని తెలుస్తోంది.


ప్రీ లుక్ ఫోటో చూస్తుంటే ఈ సినిమా కథ నాట్యం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అలాగే పోస్టర్ లోని కింద టాగ్ లైన్ చూస్తుంటే ఒక అమాయక అమ్మాయి తీసుకున్న నిర్ణయం కారణంగా ఎటువంటి పర్యవసానాలు జరుగుతాయో సినిమాలో చూపినట్టు తెలుస్తోంది. సుందరి మూవీ పూర్తి కుటుంబ భరితమైన ఎంటర్ టైనర్ అని చిత్ర బృందం చెబుతోంది.


సుందరి చిత్రాన్ని రిజ్వాన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎఎల్ విజ‌య్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న త‌లైవి సినిమాలో పూర్ణ.. శ‌శిక‌ళ పాత్ర‌లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు క‌న్న‌డ, మ‌ల‌యాళంలో మరో రెండు సినిమాల్లో నటించమని పూర్ణ కీలకమైన పాత్రను పోషిస్తున్నారని సమాచారం. ఇకపోతే సుందరి సినిమాతో నటీమణి పూర్ణ ఒక మంచి హిట్ సాధిస్తారని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: