అవునూ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నలుగురు టాప్ డైరెక్టర్లను లైన్లో పెట్టాడట. అయితే ఇంతకీ ఆ దర్శకులు ఎవరు? ఎపుడు మొదలు పెడతారు? మరి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏంటి? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ఆర్ఆర్" అనే భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో కూడా పవర్ ఫుల్ పాత్ర చేయనున్నాడు. అయితే రామ్ చరణ్ తన తర్వాతి సినిమాల గురించి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ దాదాపుగా ఓ నలుగురు టాప్ డైరెక్టర్లను లైన్లో పెట్టాడట. అయితే అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా మరొకరు కొరటాల శివ. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో "ఆచార్య" చేస్తున్న కొరటాల తన తర్వాతి సినిమా అల్లు అర్జున్ తో చేయనున్నాడు. ఆ తర్వాత చరణ్ తో ఉండొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. దాని తర్వాత ఈ సినిమా ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. "కేజిఎఫ్" సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే చాలా కాలంగా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ లతో ప్రయత్నిస్తున్నాడు. కానీ వారి నుండి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ తో సినిమా చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టు.. చరణ్ కూడా దాదాపుగా ఓకే అనే సంకేతాలు ఇచ్చినట్టు వినికిడి. అయితే తమిళ అగ్ర దర్శకుడు మోహన్ రాజా చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. అయితే మోహన్ రాజాతో చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే నలుగురు దర్శకులను లైన్లో పెట్టిన రామ్ చరణ్ మరి ఇంకెందరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: