ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఏడోవారం అనూహ్యంగా అరియానా తన ఓటింగ్ ని పెంచుకుంటోందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. మనం ఏడోవారం చూసినట్లయితే.., మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అభిజిత్ కి ఎప్పటిలాగానే ఓటింగ్ హ్యూజ్ గా వస్తోంది. అయితే, ఆ తర్వాత ప్లేస్ లో అరియానా ఉంది. అన్ అఫీషియల్ బిగ్ బాస్ పోలింగ్ ఓట్లలో అరియానాకి దాదాపు 25శాతం ఓటింగ్ జరుగుతోంది.

నిజానికి లాస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చినపుడు అరియానా డేంజర్ జోన్ లో ఉంది. ఇప్పుడు ఇంతలా ఓటింగ్ జరగడం వెనక ఆమె గేమే కారణం. ఫస్ట్ వీక్ నుంచి తన గేమ్ ఎలా ఆడుతోందో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఆడుతోంది. ఫస్ట్ నుంచి అరియానా గేమ్ అందరికంటే డిఫరెంట్ గా సాగింది. తను ఫేస్ టు ఫేస్ ఏదైనా సమస్య ఉంటే చెప్పేయడం, నిర్మొహమాటంగా – నిక్కచ్చిగా మనసులో ఏది అనిపిస్తే అది చేయడం వల్ల ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

అంతేకాదు, ఈవీక్ నామినేషన్స్ లో మెహబూబ్ తో చేసిన ఆర్గ్యూమెంట్ అక్కడ తను శాక్రిఫైజ్ చేస్కుని నామినేట్ అవ్వడం అనేది తన ఫెయిర్ గేమ్ ని చూపించింది. ముఖ్యంగా ఈ డిస్కషన్ వల్లే అరియానాని హౌస్ మేట్స్ మనసులు గెలుచుకుంది. ఆడియన్స్ ఓట్లు గెలుచుకుంది. అంతేకాదు, రాక్షసులు టీమ్ లో అందాలరాక్షసిగా గేమ్ ని చాలా బాలన్స్ గా ఆడటం అనేది కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అరియానాకి వస్తున్న ఓటింగ్ , సోషల్ మీడియాలో వస్తున్న ఫాలోయింగ్ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ – 5 లిస్ట్ లో అరియానా చోటు దక్కించుకుంటుంది.ఇక అరియానా గ్లోరీ తో పాటు అభిజీత్, మోనాల్, నోయల్, దివి, అవినాష్ లు కూడా ఈ వారం నామినేషన్ లో వున్నారు.  ఇలాంటి మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: