అవునూ.. అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత తెలుగు బిగ్ బాస్ షో సీజన్-4 లో యాంకర్ గా రానుందని సమాచారం. అయితే ఇందులో నిజమెంత? మరి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు కదా? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. దేశంలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. కరోనా కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ లేక అల్లాడిపోతున్న జనాలకు తానున్నానంటూ అభయ హస్తమిచ్చింది. కానీ తెలుగు బిగ్‌బాస్ మాత్రం పడుతూ లేస్తున్నట్లు కనిపిస్తుంది. చెప్పినంత సులువుగా ఎంటర్‌టైన్‌మెంట్ పంచలేకపోతోంది. పైగా షోకు పట్టుకున్న లీకుల తెగులు ప్రేక్షకుడికి ఉన్న కాస్తంత ఆసక్తిని కూడా చంపేస్తోంది. అయినా సరే షో నిర్వాహకులు వాటిని అరికట్టలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే.. హీరో నాగార్జున ఇటు బిగ్‌బాస్‌తో పాటు "వైల్డ్ డాగ్" అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనాలీలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో మరోసారి నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. అవేంటంటే.. నాగర్జున కొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఈసారి నాగార్జున స్థానంలో ఏకంగా ఆయన కోడలు, హీరోయిన్ సమంత హోస్ట్‌గా రానుందని ఊహాగానాలు మొదలయ్యాయి. మామ మాటను కాదనలేక ఆమె ఈ ఒక్కసారికి ఒప్పేసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పైగా దీనివల్ల షోకు అదనపు హంగు కూడా వస్తుందని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే ఇది నిజం కాకపోవచ్చని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. అటు సినిమాను, ఇటు బిగ్‌బాస్‌ను బ్యాలెన్స్ చేయడానికి నాగ్ ఇప్పటికే రెడీ అయ్యారు. గతంలో చెప్పినట్లుగానే ప్రత్యేక చార్టెడ్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చి వీకెండ్స్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అయితే దసరా ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని నిజంగానే సమంతను షోకు తీసుకువచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  లేదా నాగార్జున వస్తాడా అన్నది చూడాలి.  ఏది నిజమో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: