బిగ్ బాస్ లో ఏ రోజు ఎవరు ఎలా గొడవ పడతారు అన్నది ఊహించడం కష్టం. ఒక వారం మాత్రమే ఉండి ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ కోసం అమ్మా రాజశేఖర్ ను నామినేట్ చేసిన నోయెల్ ఆ వీక్ మొత్తం అతనితో వాదన నడిపించాడు. మాములుగా కామెడీ చేసే అమ్మా రాజశేఖర్ తనకు నచ్చని పని చేస్తే మాత్రం అవతల వారితో గొడవ పడతాడు.

ఇక గురువారం ప్రోమోలో అమ్మా రాజశేఖర్ మరోసారి నోయెల్ తో గొడవ పడినట్టు అనిపిస్తుంది. ఏదో విషయమై అమ్మా రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యాడని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. అంతేకాదు బయటకు వెళ్తే ఇది ఏమి ఉండదని నోయెల్ మీద ఎగిరెగిరి పడుతున్నాడు. మరి అమ్మా రాజశేఖర్ ఎందుకు నోయెల్ మీద సీరియస్ అయ్యాడు. అంతా ముగిశాక అభిజిత్ నువ్వు ఇప్పుడు హ్యాపీనా అని నోయెల్ అభినిత్ ను ఎందుకు ఈ గొడవలోకి లాగాడు అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

హౌజ్ లో తన కామెడీతో అందరిని అలరిస్తున్నా సరే కొన్నిసార్లు చిన్న విషయాలకు కూడా అమ్మా రాజశేఖర్ హర్ట్ అవడం ఆయన కోపాన్నంతా ప్రదర్శించడం ఆడియెన్స్ కు నచ్చట్లేదు. జరిగిన విషయం అది ఎలాంటిదైనా సరే అమ్మా రాజశేఖర్ మాత్రం అవతల వారి మీద దూషణకు దిగడం లాంటివి కొన్ని మైనస్ లుగా చెప్పుకోవచ్చు. మరి అమ్మా రాజశేఖర్ వర్సెస్ నోయెల్ అసలు గొడవకు కారణం ఏంటన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.                                                            



మరింత సమాచారం తెలుసుకోండి: