ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్న రాజమౌళి.. నీరుతో కొమరం భీం అదే మన ఎన్.టి.ఆర్ ను.. నిప్పుతో అల్లూరి సీతారామరాజుని చూపిస్తున్నాడు. ఈ సినిమా నుండి మొదట వచ్చిన అల్లూరి సీతారామ రాజు టీజర్ లో రాం చరణ్ ను అదిరిపోయేలా చూపించాడు. తారక్ వాయిస్ ఓవర్ తో మన్యం పులి అల్లూరి సీతారామ రాజు అనగానే రొమ్ము విరిచి నిలబడ్డాడు చరణ్.

ఇక ఈరోజు ఆర్.ఆర్.ఆర్ నుండి మరో టీజర్ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ కొమరం భీమ్ పాత్రకు సంబందించిన టీజర్ వచ్చింది. కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ తన నట విశ్వరూపం చూపించేలా ఉన్నాడు. ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు ఎవరికి వారు తమ బెస్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే టీజర్ ల పరంగా చూస్తే అల్లూరి సీతారామ రాజు టీజర్ మొదటి నుండి ఫైర్ మీద కనిపించింది.

తారక్ టీజర్ కూడా డైలాగులు దుమ్మురేపగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త పవర్ ఫుల్ గా ఉంటే బాగుండేదని అనిపించింది. ఏదై ఏమైనా నందమూరి హీరో టీజర్ కు మెగా హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అది ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు నచ్చడం చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ మరో సంచలన సినిమా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు పెంచుతూ ఈ రెండు టీజర్లు రిపీట్ మోడ్ లో చూసేస్తున్నారు ఇద్దరి హీరోల ఫ్యాన్స్.                                                                



మరింత సమాచారం తెలుసుకోండి: