సినిమా పరిశ్రమకు ఎనలేని సంపద ఉందని పవన్ కళ్యాణ్ తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.. అలాగే ఆయన సినీ వర్గ పెద్దలందరికీ ఆయన హైదరాబాద్ వరద బాధితులకు విరాళం అందించాలని పిలుపునిచ్చారు.. అలాగే ఆయన మాట్లాడుతూ ఎవ్వరికి తోచినంత వారు సహాయం చేయాలని కోరారు.. కొందరు సరిపోయేంత విరాళం అందించలేదని విమర్శిస్తున్నారు వాళ్లకి పవన్ కళ్యాణ్ దీటుగా సమాధానం చెప్పారు ఆయన మాట్లాడుతూ కష్టపడి పని చేసే వాళ్లు తాను సంపాదించిన దాంట్లో నుంచి ఒక పది రూపాలు ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు ఆయన వరకు తీసుకుంటే తను చాలా కోట్లు ఇలా విరాళంగా ఇచ్చారు అని పేర్కొన్నారు.. దాంతో నాది పెద్ద మనసు అనుకోవడం పొరపాటు చిత్ర పరిశ్రమ అంటే పేరు ఎక్కువ ఉంటుంది కానీ కోటి రూపాయల బడ్జెట్ పెడితే 10 కోట్లు అంత ప్రాచుర్యం వస్తుంది కానీ దాని బడ్జెట్ వచ్చేసి కోటి రూపాయలు అని పేర్కొన్నారు పేరు ఉన్నంత ఇది గా డబ్బు ఉండదు ఈ చిత్ర పరిశ్రమలో అని పేర్కొన్నారు..

  తన సొంత ఇంట్లో కూడా ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు మా చిన్న అన్నయ్య సినిమా వల్ల తన సొంత ఇంటిని కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది అప్పుడు మేం కలిసి సాయన్న అందించాము పేరేమో ఆకాశానికి ఉంటుంది కానీ డబ్బు అసలు ఉండదు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా వేల కోట్ల లాభం ఉండదు అలాగే రాజకీయ నాయకులు లాగా ఎలక్షన్ కి 200 కోట్లు ఖర్చు పెట్టే స్థాయి ఉండదు తిప్పి కొడితే సినిమా రంగానికి సీజన్కు ఒక పన్నెండు వందల కోట్ల ఆదాయం ఉంటుంది అంతే దీంతో ఆయనతెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలకు అయోమయంలో పడతారు వాళ్లని ఒక్కో ఎలక్షన్ కు ఖర్చు చేసే 200 కోట్ల నుంచి ఇలాంటి విపత్తు సమయంలో కనీసం యాభై కోట్లను ఖర్చు పెట్టాలని అన్నారు అలాగే ఆయన మాట్లాడుతూ నేను కోటి రూపాయలు సాయం చేస్తే అక్షయ్ కుమార్ 25 కోట్లు సాయం చేశాడు కోటి రూపాయలు నా స్థాయి అయితే అక్షయ్ కుమార్ పెద్ద నటుడు కాబట్టి ఆయన స్థాయికి 25 కోట్ల సహాయం చేశారు విరాళం అనేది స్పందించి ఇవ్వాల్సింది తప్ప దీంట్లో డిమాండ్స్ అంటూ ఏమీ ఉండవు
తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడారు కెసిఆర్ ప్రో ఆక్టివ్ ముఖ్యమంత్రి అంటూ పేర్కొన్నారు అందుకే ఇన్ని విరాళాలు తెలంగాణ ప్రభుత్వానికి అందరూ అందిస్తున్నారు అలాగే వరదల్లో చిక్కుకుపోయిన హైదరాబాద్ సమాజాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: