బిగ్ బాస్ సీజన్ 4కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. సీజన్ 3 హోస్ట్ గా సూపర్ హిట్ అందుకున్న నాగ్ సీజన్ 4లో కూడా తన జోష్ కొనసాగిస్తున్నారు. ఇక సీజన్ 3లో కూడా నాగార్జున ఒక వారం హోస్ట్ గా వ్యవహరించలేదు. ఆయన ప్లేస్ లో రమ్యకృష్ణ హోస్ట్ గా వచ్చి అలరించారు. బిగ్ బాస్ హోస్ట్ గా హీరోయిన్ రావడం అదే మొదటిసారి. ఇక ఈ సీజన్ లో కూడా అలాంటిది రిపీట్ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఈ వారం హోస్ట్ గా నాగార్జున బదులుగా అక్కినేని కోడలు సమంత వస్తుందని టాక్. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఈ వీకెండ్ ఎపిసోడ్ కు సమంత వస్తుందని తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ గా పెళ్లి తర్వాత కూడా సత్తా చాటుతున్న సమంత ఈమధ్య సొంత క్లాతింగ్ బ్రాండ్ మొదలుపెట్టింది. మరోపక్క సమంత సోషల్ మీడియాలో కూడా ఆమె ఫోటో షూట్స్ తో దుమ్ముదులిపేస్తుంది.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా కూడా వస్తుందని టాక్. బిగ్ బాస్ సీజన్ 4 లో నాగార్జున బదులుగా సమంత ఈ వారం హోస్ట్ గా వస్తుందని టాక్. స్టార్ హీరోయిన్స్ ఎవరికి దక్కని ఈ ఛాన్స్ సమంతకు దక్కింది. మరి సాం యాంకర్ గా బిగ్ బాస్ ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. తప్పకుండా సమంత తన ఫ్యాన్స్ అందరిని మెప్పించేలా చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. జాను తర్వాత తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్ ప్రకటించని సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో నటిస్తుందని తెలుస్తుంది. తప్పకుండా అమ్మడు పెళ్లి తర్వాత కూడా తన ఫాం కొనసాగిస్తుందని చెప్పొచ్చు.      

మరింత సమాచారం తెలుసుకోండి: