ప్రస్తుతం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.


ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకోగా నేడు ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు కూడా ఒక దానిని మించి మరొకటి ఎంతటి గొప్ప విజయాలు అందున్నాయో మనకు విషయం తెలిసిందే.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పటి నుండి కూడా ఇది తప్పకుండా బాహుబలి రికార్డులు బద్దలు కొట్టితీరుతుందని పలువురు ప్రేక్షకులు నమ్మకాలూ పెట్టుకున్నారు. ఇక నేడు రిలీజ్ అయిన కొమరం భీమ్ టీచర్ తర్వాత పక్కాగా ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డులను కొట్టడం ఖాయం అని పలువురు ప్రేక్షకులు, మెగా, నందమూరి ఫ్యాన్స్  తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయం వరకు వెయిట్ చేయక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: