బిగ్ బాస్ సీజన్ 4లో ఏడవ వారం ఎలిమినేషన్ ఉండదని టాక్. అదేంటి ప్రతి వారం ఎలిమినేషన్ పక్కా కదా అలాంటిది ఈ వారం ఎందుకు ఎలిమినేషన్ ఉండదని అంటే.. హోస్ట్ గా నాగార్జున బదులుగా అక్కినేని కోడలు సమంత వీకెండ్ ఎపిసోడ్స్ కు వస్తుందని టాక్. సమంతకు ఉన్న క్రేజ్ కు బిగ్ బాస్ హోస్ట్ గా పర్ఫెక్ట్ అని ఈసారి ఆమెని గెస్ట్ హోస్ట్ గా పిలుస్తున్నారట. సో గెస్ట్ హోస్ట్ కాబట్టి ఈవారం హౌజ్ నుండి నో ఎలిమినేషన్ అని టాక్.

అయితే లాస్ట్ సీజన్ లో శివగామి రమ్యకృష్ణ వచ్చినప్పుడు కూడా ఎలిమినేషన్ జరగలేదు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3లో సీన్ రిపీట్ చేస్తూ సీజన్ 4లో కూడా ఈ వీకెండ్ స్పెషల్ గెస్ట్ వచ్చి సర్ ప్రైజ్ హోస్ట్ గా వ్యవహరిస్తారని టాక్. తప్పకుండా ఈ హోస్ట్ ఎలిమినేషన్ లేకుండా చేస్తారని అంటున్నారు.

ఏడవ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఈ వారం మోనాల్, దివి, నోయెల్ ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కాని సమంత హోస్ట్ గా వచ్చి ముగ్గురిని సేవ్ చేస్తుందని టాక్. అదే జరిగితే బిగ్ బాస్ ఓటింగ్స్ వేసిన ఆడియెన్స్ పెద్ద బకరాలయ్యే ఛాన్స్ ఉంది. మరి బిగ్ బాస్ హోస్ట్ గా సమంత నాగ్ ప్లేస్ లో వస్తుందా లేదా అన్నది శుక్రవారం సాయంత్రం వరకు తెలుస్తుంది. సమంత హోస్ట్ గా కూడా తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యింది.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: