దాదాపుగా రెండున్నరేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, అంజలి, నివేదాథామస్, శృతిహాసన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతుండగా ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మగువ మగువ అనే సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన రాబట్టాయి.
గతంలో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన పింక్ అనే కోర్ట్ డ్రామా మూవీకి అధికారిక తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి దసరా పండుగ రోజున అనగా మరొక రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఒక సర్ప్రైజింగ్ అప్ డేట్ రాబోతుందని సమాచారం అందుతోంది. కాగా అది ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి సంబంధించింది అంటూ అని కొందరు అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే ఎప్పటినుండో ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానుల ఆశలు నెరవేరినట్లే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: