తెలుగు రాష్ట్రాల్లో టాప్ రేటింగ్ టివి సీరియల్ ఏది అంటే అందరు చెప్పే ఒకే ఒక్కమాట కార్తీక దీపం. ఆ సీరియల్ వల్లే స్టార్ మా నంబర్ 1 ఛానెల్ గా కొనసాగుతుంది. బిగ్ బాస్ లాంటి భారీ బడ్జెట్ రియాలిటీ షో కూడా కార్తీక దీపం రేటింగ్స్ ను బ్రేక్ చేయలేకపోతుంది అంటే కార్తీక దీపం క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏపి, తెలంగాణాలో కార్తీక దీపం సీరియల్ వ్యూయర్స్ ఓ రేంజ్ లో ఉన్నారు.

అందుకే ఆ సీరియల్ కు సూపర్ రేటింగ్స్ వస్తున్నాయి. ప్రతి వారం దాదాపు టాప్ పొజిషన్ లో కార్తీక దీపం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ వారం కూదా కార్తీక దీపం నంబర్ 1 రేటింగ్స్ తో దూసుకెళ్తుంది. స్టార్ మా లో కార్తీక దీపం నంబవర్ 1 పొజిషన్ లో ఉండగా ఇంటింటి గృహలక్ష్మి టాప్ 2లో ఉంది. ఇక థర్డ్ పొజిషన్ లో స్టార్ మాలో వచ్చే వదినమ్మ సీరియల్ ఈ వారం టాప్ 3లో నిలిచింది. ఇక జెమిని టివిలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా టాప్ 4లో నిలిచింది.

మళ్ళీ టాప్ 5లో స్టార్ మా దేవత ప్రోగ్రాం నిలిచింది. అంటే టాప్ 5లో నాలుగు స్థానాల్లో స్టార్ మా అదరగొడుతుంది. స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్ తో పోల్చితే బిగ్ బాస్ రేటింగ్స్ తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి బిగ్ బాస్ ఎన్ని క్రేజీ టాస్కులు ఇచ్చినా సరే చూస్తున్న ఆడియెన్స్ చూస్తున్నారే తప్ప సీరియల్ రేటింగ్స్ ను మాత్రం క్రాస్ చేయడంలో వెనకపడ్డారు.                                               

మరింత సమాచారం తెలుసుకోండి: