టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వారిద్దరి పాత్రలను వివరిస్తూ టీజర్లను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ పై టీజర్ గతంలోనే రాగా.. ఎన్టీఆర్ పై టీజర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈ టీజర్లు రెండింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఎన్టీఆర్ కొమురం భీమ్ టీజర్ లో కొన్ని కాపీ సీన్లు ఉన్నాయంటూ నెట్టింట్లో పిక్స్ రౌండ్ అవుతున్నాయి.
ఈ టీజర్ లోని కొన్ని సన్నివేశాలు పలు డాక్యుమెంటరీలు, ఇంగ్లీష్ సినిమాల్లోనివి అంటూ నెటిజన్లు ఫొటోలతో సహా వదిలేశారు. అగ్నిపర్వతం పేలడం, నీటి బిందువులు పడటం, అడవిలోని చెట్ల మధ్యలో సూర్యుడ్ని చూపించే సన్నివేశాలను యధావిధిగా వాడేశారంటూ నెటిజన్లు పోస్ట్ చేశారు. దీంతో రాజమౌళి కూడా ఎందుకు ఇలా చేసినట్టు అంటూ కౌంటర్లు పడుతున్నాయి. ఇన్స్ పిరేషన్ గా తీసుండొచ్చు కానీ.. ఇలా యధావిధిగా వాడేస్తారా అంటూ నెటిజన్ల ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సన్నివేశం ఏ సినిమాలోనిదో చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఆదే పని చేశారు. ఈ కాపీ సన్నివేశాలు పక్కన పెడితే భీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. రామ్ చరణ్ వాయిస్ టీజర్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. వీరిద్దరి టీజర్లతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి అనడంలో సందేహం లేదు. అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రియ తదితరులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: