సాధారణంగా పోర్న్ సైట్ కి ఫోటోలు , లేదా వీడియోలు వెళితే వాటిని తొలగించడం కష్టం అవుతుంది. అందుకన్నా ముందే ఆ సైట్ కు ఫాలోవర్స్ కూడా ఎక్కువే..దీంతో పెట్టీ పెట్టగానే అందరూ చూసేస్తారు. అందుకే ఏం చేసినా ఈ సైట్ వరకు వెళ్లకుండా చూసుకోవాలని అంటున్నారు. అయితే ఇప్పుడు ఓ మలయాళ నటి ఈ సైట్ నుంచి ఆమె వీడియోలను , ఫోటోలను తొలగించడానికి చాలా కష్ట పడుతుంది. అసలు ఎవరు ఆ నటి ఏం జరిగిందో చూద్దాం..



సోనా ఎమ్‌ అబ్రహం అనే నటి మలయాళ చిత్రం 'ఫర్‌ సేల్‌'లో నటించింది. అప్పుడు ఆమె వయస్సు 14 సంవత్సరాలు. 2013లో తెరకెక్కిన ఈ చిత్రంలో తనపై జరిగిన అత్యాచారం సంగతి తెలిసి తన సోదరి సంధ్య ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటుందని.. అయితే ఈ అత్యాచార సీన్‌.. అప్పుడు నేను చేయలేనని చెప్పినా దర్శకుడు సతీష్‌ అనంతపూరి, నిర్మాత ఆంటో కడవెలిల్‌లు పట్టుబట్టి మరీ చేయించారని వెల్లడించింది.



దాదాపు 150 మంది తో ఆ సీన్ ఉంటుందట..అయితే సినిమాలో మాత్రం కొంతవరకు ఉంచి మిగితా పార్ట్ ను డిలీట్ చేశారు. కాగా, ఆ సీన్లు సినిమా లో కాకుండా పోర్న్ సైట్ లో కనిపిస్తున్నాయని నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ సీన్లు కొద్ది రోజులు డిలీట్ చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ అవి పోర్న్ సైట్ లో కనిపిస్తున్నాయని నటి ఆవేదన వ్యక్తం చేసింది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, కేరళ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తారని చూస్తున్నట్లుగా ఆమె తెలిపింది. కాగా ఈ సీన్‌ విషయమై ఇప్పటికే సోనా ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.. ఏదో చిన్నప్పుడు తెలియని వయసులో చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నా అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..ప్రస్తుతం ఈ మ్యాటర్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: