ఇండస్ట్రీ వర్గాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో  ఎదురుచూసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని జూనియర్ పాత్రకు సమ్బంధించిన టీజర్ విడుదల అయిన కొన్ని నిముషాలలోనే వైరల్ గా మారింది. ఈమూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఎన్టీఆర్ చరణ్ లుక్స్ ని బట్టి రాజమోళి ఏమి చెప్పబోతున్నాడు అన్న చర్చలు మొదల య్యాయి.  


చరిత్ర ప్రకారం తెలంగాణకు చెందిన విప్లవవీరుడు కొమరం భీమ్ మరియు ఆంధ్రప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఎప్పుడు ఒకరినొకరు కలుసుకోకపోయినా వారిద్దరూ కలుసుకుంటే అన్న  ఊహతో ఫిక్షనల్ స్టోరీగా నిర్మాణం జరుపుకుంటున్న ‘ఆర్ ఆర్ ఆర్’ లో దేశభక్తి కంటే వారి మధ్య ఉండే స్నేహం గురించి ప్రధానంగా చెప్పబోతున్నారని లీకులు వస్తున్నాయి. ‘భీమ్ ఫర్ రామరాజు' లో చరణ్ ని పోలీసుగా చూపించిన రాజమౌళి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ లో తారక్ ని ఒక ముస్లిమ్ యువకుడిగా చూపించాడు.


ఇద్దరినీ యుద్ధవీరులుగా చూపిస్తూ రామరాజు భీమ్ సోదర భావంతో ఉంటారన్న విషయాన్ని టీజర్స్ ద్వారా వెల్లడి చేస్తూ
చరణ్ ని నిప్పుల్లో చూపించిన రాజమౌళి ఎన్టీఆర్ ని నీళ్లలో చూపించాడు.  దీనితో పంచభుతాలకు సంబంధించి ఏదో ఒక ఊహించని విషయం కూడ ఈమూవీ ద్వార రాజమౌళి చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఈమూవీ కధ  ఎలా ఉన్నా విజువల్ వండర్ ని ప్రేక్షకులు చూడబోతున్నారు అన్న స్పష్టమైన అంచనాలు వస్తున్నాయి.  


నిన్న విడుదలైన కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ లో అందరినీ ఆకట్టుకున్నది ఎన్టీఆర్ బాడీ అన్నకామెంట్స్ అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఇక డైలాగుల విషయం చూస్తే గతంలో ‘ఖలేజా’ మూవీలో మహేష్ గురించి రావు రమేష్ చేత చెప్పించిన డైలాగుల  స్టైల్ లో చరణ్ డైలాగులు ఉన్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి.  నిన్న విడుదలైన ఈటీజర్ కు విపరీతమైన స్పందన వస్తున్నా గతంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ లో ఎన్టీఆర్ గంభీరంగా పలికినంతగా రామ్ చరణ్ డైలాగులు పలకలేకపోయాడనే కామెంట్స్ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: