తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనడంలో అతిశయోక్తి లేదు. కైపెక్కించే చూపులతో ఎప్పుడూ కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది నిధి అగర్వాల్. ఇక నిధి అగర్వాల్ ను  చూస్తూ ఎప్పుడూ పగటి కలల్లో గడుపుతూ ఉంటారు అభిమానులు. అంతకుముందు వరకు సాదాసీదా హీరోయిన్గా తన ప్రస్థానాన్ని కొనసాగించిన నిధి అగర్వాల్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మరోసారి ప్రేక్షకులు అందరిని ఆకర్షించి  అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.



 ఇక ఈ సినిమా  తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నిధి అగర్వాల్ ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం సినిమాలలోనే కాకుండా అటు సోషల్ మీడియా వేదికగా కూడా హాట్ హాట్ ఫోటో షూట్లతో ఎప్పుడూ అభిమానుల మతి పోగొడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో ఎలాంటి లిమిట్ పెట్టుకోకుండా అభిమానులకు ఫుల్ మీల్స్ అందిస్తూ ఉంటుంది నిధి అగర్వాల్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు.



 ఇక ఇటీవలే నిధి అగర్వాల్ ఒక హీరోతో డేటింగ్ లో ఉంది అని టాలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది. ఎన్నో రోజుల నుంచి నిధి అగర్వాల్ ఒక యువ హీరోతో డేటింగ్ లో కొనసాగుతుందని.. రహస్యంగా చెట్టా పట్టా లేసుకొని తిరుగుతున్నారు అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఇటీవలే తాను డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.. ఎవరితో డేటింగ్ చేయడం లాంటిది ఏమీ లేదని.. ఇప్పటికీ కూడా తాను సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది... లాక్ డౌన్ సమయంలో కూడా రిలేషన్ షిప్ వైపు ఆసక్తి చూపలేదు అంటూ తెలిపింది నిధి అగర్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: