బిగ్ బాస్ సీజన్ 4లో కొత్త కెప్టెన్ గా అవినాష్ ఎంపికయ్యాడు. మొన్న జరిగిన కొటె రాక్షసులు, మంచి మనుషులు టాస్క్ లో భాగంగా బెస్ట్ పర్ఫార్మర్స్ గా నిలిచిన అవినాష్, అరియానాలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. అయితే వీరి కోసం బిగ్ బాస్ బండి తొయ్యరా బాబు అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇద్దరికి గార్డెన్ ఏరియాలో రెండు స్టేషన్స్ ఇచ్చి ఎక్కువమందిని తమ ట్రాలీలో తీసుకెళ్లి స్టేషన్ లో చేర్చాల్సి ఉంటుంది. ఎక్కువమందిని ఎవరైతే చేరుస్తారో వారే కెప్టెన్ అయినట్టు.

అయితే అవినాష్, అరియానా కాకుండా మిగతా 10 మందిలో చెరో ఐదుగురిని అవతల స్టేషన్స్ లో దించుతారు ఆట టై అయ్యిందని మరో ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్ అవతల టీం సభ్యులను కన్విన్స్ చేసి వారిని కూడా ఇవతల స్టేషన్ లోకి తీసుకు రావాలని అంటాడు. దానితో మోనాల్ అవినాష్ కు సాయం చేస్తుంది. సో అలా అవినాష్ ఆరుగురు సభ్యులను స్టేష్ లో చేర్చడంతో అతను కెప్టెన్ అయ్యాడు.

ఇక కెప్టెన్ గా మారిన అవినాష్ తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. మైక్ ఎవరు ధరించడం లేదో వారు మైక్ తీసి పెట్టుకుంటున్నట్టుగా 100 సార్లు చేయాలని అన్నాడు. ఇక నిద్రపోయి కుక్కలు అరిస్తే స్విమింగ్ పూల్ లో దూకాలని అన్నాడు. రేషన్ మేనేజర్ గా హారికని ఎంపిక చేశాడు. సో కెప్టెన్ అవగానే అవినాష్ తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. సో కెప్టెన్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ నుండి సేవ్ అయినట్టే.                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: