యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు నేడు దశదిశలా మారుమోగిపోతోంది. ఇంటర్నేషనల్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న ప్రభాస్ పుట్టినరోజు నేడు. తెలుగు చిత్ర పరిశ్రమలలో అభిమానులు ముద్దుగా 'డార్లింగ్' అని పిలుచుకునే ఏకైక హీరో ప్రభాస్. ఆయన 2002లో 'ఈశ్వర్' చిత్రంతో వెండితెరపై తెరంగ్రేటం చేశారు. ‘రాఘవేంద్ర’ మూవీతో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కొద్ది సంవత్సరాల క్రితం వరకు అతనొక హీరో.. అభిమానులకు ‘రెబల్ స్టార్’.. ఇప్పుడు ‘గ్లోబల్ స్టార్’.. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు డార్లింగ్ ఉప్పలపాటి ప్రభాస్.

ప్రభాస్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కి ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాతో ప్రభాస్ కి యూత్ లో ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. 5. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా ప్రభాస్ ని ఓ స్టార్ హీరోగా నిలబెట్టింది.అప్పటివరకు ఒకే మూసలో వెళ్తున్న ప్రభాస్ ని కొత్తగా ప్రేక్షకులకి పరిచయం చేసింది మాత్రం బుజ్జిగాడు అనే చెప్పాలి.. ఇందులో కనిపించినట్టుగా ప్రభాస్ మరే సినిమాలో కూడా కనిపించడు. ఈ సినిమాకి లేడిస్ ఫాలోయింగ్ ఎక్కువే.

ఇక 2010లో వచ్చిన డార్లింగ్, 2011 రిలీజైన మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలు హిట్ కావడంతో.. ఇండస్ట్రీలో ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ క్లాస్ హీరోగా ప్రభాస్ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత విడుదలైన రెబల్ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అనంతరం విడుదలైన మిర్చి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

అయితే రెండో సారి రాజమౌళితో జతకట్టిన ప్రభాస్ కి బాహుబలితో తన ఇమేజ్ మాత్రమే కాదు.. తెలుగు సినిమా ఇమేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. బాహుబలి సినిమా ముందు, తర్వాత అనే రేంజ్ లో తెలుగు సినిమా స్థాయి మార్కెట్ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా తో సహా పలు దేశాల్లో బాహుబలి సూపర్ సక్సెస్ సాధించింది. తెలుగు సినీ హీరోలలో ఎవరికి దక్కని అరుదైన గౌరవం ప్రభాస్ కు మాత్రమే దక్కింది. ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ప్రభాస్ కు  అభిమానుల తరుపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: