రాజమౌళి, పూరీ జగన్నాథ్.. ఇద్దరూ ఇద్దరే. ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హిస్టరీ వీరిది. అయితే వీరిద్దరిలో ఎవరి స్టైల్ వారిది. పూరీ జగన్నాథ్ సినిమాలు తీయడంలో జెట్ స్పీడ్ అయితే, రాజమౌళి నిదానంగా చెక్కుతూ కూర్చుంటారు. అందుకే ఆయనకి జక్కన్న అనే పేరొచ్చింది. ఎంత నిదానంగా చెక్కినా.. అంతే క్వాలిటీగా ఉంటాయి రాజమౌళి సినిమాలు. పూరీ హడావిడిగా తీసినా కూడా క్వాలిటీ మిస్ కాకుండా ఉంటాయి.

అయితే ఇప్పుడు రాజమౌళి బాటలోకి వెళ్తున్నారట పూరీ జగన్నాథ్. లేటెస్ట్ మూవీ ఫైటర్ కోసం ఆయన కూడా జక్కన్నగా మారిపోతున్నాడట. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసే పూరీ.. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఫైటర్ సినిమా కోసం మాత్రం ఎప్పుడూ లేని విధంగా సమయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అందులోనూ పూరీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ జనాల్లో తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పూరీ కొంత ట్రాక్ మార్చి ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత వెంటనే 'ఫైటర్' ని పాన్ ఇండియా లెవల్లో స్టార్ట్ చేశాడు. హీరో విజయ్ దేవరకొండ గత చిత్రాలు 'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రౌడీకి ఇప్పుడు ఒక హిట్ అవసరం ఉంది. దీంతో ఇప్పుడు ఈ బాధ్యత పూరీ పై ఉందని.. అందుకే పూరీ తన స్టైల్ మార్చి ఈ సినిమాకు ఎక్కువ టైం తీసుకొని తీస్తున్నాడని టాక్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తుంది. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యహరిస్తున్నారు. హీరో విజయ్ కి హిట్ ఇవ్వాల్సిన బాధ్యతతోపాటు, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో లాంగ్ రిలేషన్ కొనసాగాలంటే పైటర్ సినిమా హిట్ కావాలి. అందుకే పూరీ ఈ సినిమా విషయంలో ఎక్కడలేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: