అవునూ.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో(అక్టోబర్ 30న) పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతి తక్కువ మంది సమక్షంలో కాజల్ పెళ్లి జరగనుందని సమాచారం. టాలీవుడ్ లో దాదాపుగా ఎవరికి ఇన్విటేషన్ అందలేదని తెలుస్తోంది. అయితే ఓ యువ హీరోకి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్ అందిందని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత తమ వైవాహిక జీవితం కోసం ఓ కొత్త ఇల్లును రెడీ చేసుకునే పనిలో ఉందని తెలుస్తోంది. అయితే ఆ విశేషాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. కాజల్ అగర్వాల్ ఈ నెల (అక్టోబర్) 30న ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారి పెళ్లి అనంతరం వారు కలిసుండబోయే ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు ఆ జంట. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ "మా కొత్త ఇంటి అలంకరణం ఎలా ఉంది.. మీరేమైనా సలహాలు ఇవ్వగలరా" అంటూ ఆ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పింది. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ముందు కూడా తనను ఆదరిస్తారని చందమామ బ్యూటీ ఆకాక్షించారు. కొంతకాలంగా గౌతమ్‌ కిచ్లు, అగర్వాల్‌ మధ్య నడిచిన స్నేహం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగినట్టు సమాచారం. కాజల్‌ ఇంట్లోనే పెళ్లి వేడుక జరగనుంది. కేవలం కుటుంబ సభ్యుల మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక "ఈ మహమ్మారి ఖచ్చితంగా మా ఆనందానికి గంభీరమైన వెలుగునిచ్చింది, కాని మేము కలిసి మా జీవితాలను ప్రారంభించబోతున్నందుకు సంతోషిస్తున్నాము. మీరందరూ ఈ సంతోష సమయంలో మమ్మల్ని ఉత్సాహపరుస్తారని అశిస్తున్నాను" అని కోరారు కాజల్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: