కరోనా కారణంగా థియేటర్లు ఇప్పటివరకూ తెరుచుకోవడం లేదు. అయితే ఈ నెల 15వ తేదీన థియేటర్లు ఓపెన్ చేయాలనే ప్రతిపాదన ఉన్నా.. తక్కువ సంఖ్యలో ప్రేక్షకులు సినిమాను వీక్షిస్తారని, దీన్ని వల్ల ఎలాంటి లాభం చేకూరదని నిర్మాత సంఘ నిపుణులు తెలిపారు. ఈ మేరకు పలు సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే చాన్సులు ఉన్నాయి.

తాజాగా నందమూరి బాలకృష్ణ నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘నర్తనశాల’. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా కొన్నేళ్ల క్రితం ప్రారంభమైనా కొన్ని కారణాల వల్ల ఆగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కేవలం 17 నిమిషాల ఫుటేజీ వీడియోను శ్రీయాస్ ఈటీ ద్వారా ఈ నెల 24న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల బాలయ్య స్వయంగా ప్రకటించారు. నర్తనశాల సినిమా ద్వారా వచ్చే మొత్తం కలెక్షన్లలో కొంత భాగాన్ని చారిటీకి అందజేయబోతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అబు బాగ్దాద్ గజదొంగ’ సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. అయితే ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించి ట్రైలర్ ను రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. 90వ దశాబ్దానికి చెందిన ఈ సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఇండియన్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కలిసి ఈ సినిమాకు పని చేయనున్నారు. అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో 50 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేశారు. ఈ రెండు సినిమాల విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: