ఆర్.ఆర్.ఆర్ నుండి నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కొమరం భీమ్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి ఒక తీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ వాయిస్ తో వచ్చిన ఈ టీజర్ రచ్చ రేపుతోంది. కొమురం భీమ్‌ 119వ జయంతి సందర్భంగా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో టీజర్‌ని విడుదల చేశారు. అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ సాగింది. ఎన్టీఆర్‌లాగే రామ్‌చరణ్‌ కూడా మలయాళం మినహా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో వాయిస్‌ ఓవర్‌ చెప్పారు.

ఇక దీనికి సంబంధించి భీమ్‌ శక్తియుక్తుల్ని మన రామరాజు కాకుండా అత్యుత్తమంగా ఎవరు వర్ణిస్తారు అంటూ రాజమౌళి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్‌ పాత్రలో రెండో కోణాన్నీ టీజర్‌ లో చూపించిన జక్కన్న రామ్‌చరణ్‌ పాత్రని నిప్పుతో, ఎన్టీఆర్‌ పాత్రని నీటితో పోల్చుతూ స్క్రిప్టుని డిజైన్‌ చేశారు రాజమౌళి.

ఇక ఇప్పటికే వ్యూస్ అలానే లైక్స్ పరంగా ఫాస్టెస్ట్ మరియు భారీ రికార్డులు సృష్టించదానికి రెడీగా ఉన్న తారక్ అభిమానులు వారు ముందు చెప్పినట్టుగానే మన టాలీవుడ్ లో ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ గా నిలిపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 9 లక్షల లైక్స్ మార్క్ ను క్రాస్ చేసిన ఈ భీమ్ టీజర్ ఖచ్చితంగా 1 మిలియన్ అందుకోవడం కన్ఫర్మ్ అయ్యినట్టే అని చెప్పాలి. ఈ లెక్కన మొట్ట మొదటిసారిగా మన తెలుగు నుంచి 1 మిలియన్ లైక్స్ తో ఒక తీజర్ అది కూడా హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట నమోదు కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: