రెండు గుండెల్లో పుట్టే ప్రేమ వారి మధ్య ఉండాలని భావించే సాధారణ వ్యక్తి. సినిమా ప్రేమికుడైన జి.బాబు రాసుకున్నటువంటి ఓ ప్రేమకథను రచయిత ఆత్రేయకు వినిపించాడు. ఆ స్టోరి రెండు హృదయాల మధ్య భావోద్వేగాలను తెలిపే అందమైన ప్రేమ కథ. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా చిత్రీకరించాలని నిర్మాత జి.బాబుకి ఆత్రేయ సలహా ఇచ్చారు.

జి.బాబు అలా సినిమాకు ఓకే చెప్పాడో లేదో సినిమాకు సంబంధించి పాటల కంపోజిషన్ కి ఇళయరాజాను ఎంపిక చేసుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆత్రేయ వారం రోజుల్లోనే ‘మంచు కురిసే వేళలో’ పాట మినహా మిగితా అన్ని పాటలు రాశారు. జి.బాబు శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖలు మేము డబ్బులు ఇచ్చినా పాటలు అలా రాయడని తెలిపారు. తక్కువ సమయంలో మంచి పాటలు రాశాడని ఆశ్చర్యపోయారు. సినిమా కథ నచ్చడంతో ఆత్రేయ మనుసుపెట్టి ఆ పాటలు రాశాడని, ఆ పాటలు ప్రేక్షకుల మన్నన పొందాయి.

అయితే ఈ సినిమా స్టోరి చాలా స్లోగా ఉంటుందని చాలా జాగ్రత్తగా చిత్రీకరించాలని ఇళయరాజు దర్శకుడు జి.బాబుకు సలహా ఇచ్చాడు. ఇక జి.బాబు కథ మొత్తం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ తన వంతు ప్రతిభ చూపాడు. సినిమా హీరో, హీరోయిన్ల ఎంపికలో ఆలోచనలో పడ్డాడు దర్శకుడు.

ఈ సినిమాను హీరో హీరోయిన్లుగా చిరంజీవి, శ్రీదేవి నటిస్తే బాగుంటుందని దర్శకుడు జి.బాబు భావించారు. సినిమా టైటిల్ ‘అభినందన’ అని పెట్టారు. మూడు, నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీదేవి అభినందన సినిమాకు ఓకే చెప్పారు. ఈ తర్వాత చిరంజీవి పర్సనల్ మేనేజర్ ను కలిసి సినిమా గురించి చెప్పారు. సరే చూద్దామని చెప్పి పీఏ తప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ చిరంజీవి కోసం వెళ్లారు. అప్పుడు మేనేజర్ ఓల్డ్ లవ్ స్టోరి అని.. స్టోరి మీకు పనికి రాదని చిరంజీవితో చెప్పారు. డేట్స్ ఖాళీగా లేవని జి.బాబుకు తెలిపారు.

చిరంజీవి అభినందన సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీదేవి కూడా సినిమాను వదులుకుంది. దీంతో అన్వేషణ సినిమా హీరో కార్తీక్, వాలుకనుల శోభనతో సినిమాను 1988లో తీశారు. చాలా సింఫుల్ గా రిలీజ్ అయి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం’ పాట ప్రతిఒక్కరి పెదాలపై పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: