సైరా సినిమా తరువాత భారీ గ్యాప్ తీసుకున్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా లైన్ లో వుండగానే ఆయన వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో ఆయన వేదాళం తెలుగు రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.  దీనికి 'శక్తి' ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ అంతా రెడీ అయింది అని, చిరంజీవికి కూడా నచ్చిందని అంటున్నారు. ఇక తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను మౌంట్ చేయడానికి రామ్-లక్ష్మణ్ లని ఎంపిక చేశారని అంటున్నారు.  

ఇది యాక్షన్ ఎంర్టైనర్ కావడంతో పాటు  మెగాస్టార్ కూడా భారీ పాత్రలో కనిపించనుండటంతో, వీరిద్దరిని సంప్రదించారని అంటున్నారు. నిజానికి వీరికంటే ముందే కేజీ ఎఫ్ సినిమాకి పని చేసిన ఇద్దరు యాక్షన్ డైరెక్టర్ లని అనుకున్నారు. కానీ మళ్ళీ ఏమయిందో వాళ్ళని తప్పించి రామ్ లక్ష్మణ్ మాస్టర్ లని తీసుకున్నట్టు చెబుతున్నారు. మాస్ సినిమాల విషయానికి వస్తే వీళ్లిద్దరూ ఎక్స్ పర్ట్ లు అని మన దర్శకులు నమ్ముతారు. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రం 2021 లో చిత్రీకరించబడుతుందని అంటున్నారు.

ఇటీవల, సాయి పల్లవి లేదా కీర్తి సురేష్ ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా నటిస్తారని పుకార్లు వచ్చాయి. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు.  ప్రీ-ప్రొడక్షన్ పనుల విషయానికొస్తే, 'చలో' సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి పని చేస్తున్నాడు. అతను ఇప్పటికే మ్యూజిక్ సెషన్లను ప్రారంభించాడని అంటున్నారు. చిరు ఇటీవల సినిమా కోసం బట్టతల తల రూపాన్ని కూడా పరీక్షించారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే పార్ట్ కోసమే ఈ లుక్ టెస్ట్ జరిగింది అని అంటున్నారు. ఇక ఈ విషయాలని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: