ప్రభాస్ నేడు 41వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు విషెస్ అందిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచే ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే ప్రభాస్ ట్యాగ్  వైరల్ అయ్యింది.  అయితే ప్రభాస్ పుట్టినరోజూ సందర్బంగా నేడు ఆయన నెక్స్ట్ సినిమాకు సంబందించిన లుక్ ని కూడా రిలీజ్ చేశారు. మొన్ననే సాహో సినిమాతో ప్రభాస్ సౌత్ ఆడియెన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.

 ఇక అయన కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయినా ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ నే మార్చేసింది. ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ఆ వర్షం సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ తరువాత 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ ని సమూలంగా మార్చేసి స్టార్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది.

ఆ తరువాత అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు అంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు వరసగా హిట్ కొట్టాయి. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఫ్రాంచైజ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఆ తరువాత వచ్చిన క్రేజ్ తో ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. ఒకటి రాధే శ్యామ్ కాగా మరొకటి నాగ్ అశ్విన్ సినిమా, అలానే ఓం రౌత్ తో ఆది పురుష్ సినిమా అనౌన్స్ చేశాడు. ఇక హ్యాపీ బర్త్ డే ప్రభాస్ ట్యాగ్  ఇప్పుడు నేషన
ల్ వైడ్ లో నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: