నందమూరి బాలక్రిష్ణ. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీయార్ తరువాత అన్ని రకాల  జోనర్లలో  నటించి మెప్పించగల హీరో మెటీరియల్. బాలయ్య జానపదాలు, చారిత్రాత్మక పాత్రలు  చాలా చేశారు. పౌరాణికాలు చేశారు. ఇక సాంఘీకాలకు లెక్కే లేదు. బాలయ్య కెరీర్లో అద్భుతమైన జానపద చిత్రంగా భైరవ ద్వీపం ఎపుడూ ఉంటుంది. ఆ తరువాత సైన్స్ ఫిక్షన్ గా ఆదిత్య 369 ఉంటుంది. సోషల్ మూవీస్ లో చాలా ఉన్నాయి. పౌరాణికాల్లో శ్రీరామరాజ్యం మేటిగా చెప్పాలి.

ఇపుడు బాలయ్య నర్తన శాల అంటూ ఈ నెల 24న ముందుకు వస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య తాను డైరెక్ట్ చేసిన కొన్ని సీన్లను షార్ట్ ఫిల్మ్ గా మార్చి ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇది కనుక జనాలకు నచ్చితే ఫుల్ లెంగ్త్  మూవీగా నర్తనశాలను తీస్తానని కూడా  బాలయ్య అంటున్నారు. సరే నర్తనశాల విషయంలోనే  బాలయ్య ఫ్యాన్స్  మురిసిపోతున్నారు.

కానీ బాలయ్య ఒక అద్భుతమైన జానపద చిత్రంలో నటించారు.  దాదాపు రెండు దశాబ్దాల క్రితం మూవీ ఇది. దీన్ని బాలయ్య మాతృ సంస్థలా భావించే భార్గవ్ ఆర్ట్స్ వారు నిర్మించారు. ఈ మూవీని దిగ్దర్శకుడు కోడి రామక్రిష్ణ డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో బాలయ్య పక్కన పూజా బాత్రా. అంజలా జవేరీ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ కోసం అప్పట్లో  విశాఖలో భారీ సెట్స్ కూడా వేశారు.

దాదాపుగా తొంబై శాతం పైగా పూర్తి అయిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటూనే  భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాలరెడ్డి కన్నుమూశారు. ఆయన కుమారుడు భార్గవ్ కూడా ఆ మధ్యన చనిపోయారు. ఇక రెండేళ్ళ క్రితం మరణించిన కోడి రామక్రిష్ణ కూడా ఈ మూవీని పూర్తి చేస్తానని తరచూ  చెబుతూ ఉండేవారు. ఎటూ మూలన పడిన నర్తన శాలను బయటకు తెచ్చిన బాలయ్య అదే ఊపుతో విక్రమ సింహ భూపతిని కూడా బయటకు తెచ్చి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి బాలయ్య ఆ కోరిక తీరుస్తారా.

మరింత సమాచారం తెలుసుకోండి: