తెలుగు సినిమాలకు కమెడియన్ల కొరత లేదు. ఒకప్పుడు అయితే పాతిక మందికి తక్కువ కాకుండా ఉండేవారు. ఒక సీజన్ అంతా వారే అన్నట్లుగా కధ నడించింది. ఇక కామెడీకి ఎపుడూ టాలీవుడ్లో పెద్ద పీట వేస్తారు. ఇవన్నీ ఇలా ఉంటే కామెడీ చేసేవారు హీరోలుగా సక్సెస్ కొట్టడం కూడా ఎక్కువగా టాలీవుడ్ లోనే జరుగుతూ వచ్చింది.

ఒకపుడు స్టార్ కమేడియన్ గా పేరు తెచ్చుకున్న సునీల్ తరువాత హీరోగా కూడా తన  రేంజి పెంచుకున్నాడు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా. ఆ తరువాత వరసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో సునీల్ తిరిగి కమెడియన్ గా ట్రై చేస్తున్నాడు. కానీ పెద్దగా సక్సెస్ కావడంలేదు. ఈ లోగా ఆయన కొన్ని సినిమాలో ఎంచుకుంటున్న పాత్రల విషయంలో కూడా చర్చ సాగుతోంది

ఇదిలా ఉంటే సునీల్ కలర్ ఫోటో అని ఒక లో బడ్జెట్ మూవీలో విలన్ గా వేశాడట. ఈ మూవీకి గానూ తొమ్మిది రోజుల వర్క్ కి సునీల్ తీసుకున్న మొత్తం పది లక్షలు అని ప్రచారం సాగుతోంది. అదే నిజం అయితే రోజుకు లక్ష అన్న మాట. మరీ అంత తక్కువ పారితోషికం సునీల్ ఎందుకు పుచ్చుకున్నాడు అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.

సునీల్ ఒకపుడు స్టార్ కమెడియన్ గా చేస్తున్నపుడు సినిమాకు రెండు నుంచి మూడు కోట్లు తీసుకునేవాడుట. కానీ ఇపుడు మరీ ఇలా లక్షలకు రావడమేంటని కూడా అంటున్నారు. నిజంగా సునీల్ కెరీర్ కొంత ఇబ్బందుల్లో ఉందన్న మాట ఎలా ఉన్నా కూడా ఆయన తన రేంజిని తానే ఇంకా తగ్గించుకుంటున్నాడా అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయ‌ట. చూడాలి మరి ఫ్యూచర్ లో అయినా సునీల్ కెరీర్ గాడిన పడాలని అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సునీల్ కామెడీలో మంచి టైమింగ్ ఉంటుంది. ఆయన టాలెంటెడ్ ఆర్టిస్ట్. టాలీవుడ్ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: