టాలెంట్ ఉన్నా హిట్ దక్కని హీరో సూర్య.. తన సినిమా ల్లో ఎప్పుడు వెరైటీ ఉండేలా చూసుకునే సూర్య చాలా వరకు ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.. అందుకే సూర్య సినిమాల్లో హిట్ లకంటే ఫ్లాప్ లే ఎక్కువ.. సౌత్ హీరోల్లోనే హీరో సూర్య ఓ వెరైటీ పేరు ఉంది. అన్ని భాషల్లో సూర్య కి మంచి మార్కెట్ ఉంది.. తమిళం తర్వాత సూర్య ని ఎక్కువగా తెలుగు ప్రేక్షకులే ఆదరిస్తారు.. ఇంతవరకు అయితే డైరెక్ట్ తెలుగు సినిమాలు అయితే చేయలేదు కానీ త్వరలో ఆ ముచ్చట కూడా తీర్చేశాడంలో ఎలాంటి సందేహం లేదు..

అయితే సూర్య గత కొద్ది సినిమాలుగా మంచి సినిమాలు చేయట్లేడనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..  అయితే అయన ఆశలు అన్ని ఆకాశం నీ హద్దురా అనే సినిమాపైనే పెట్టుకున్నాడు..గురు లాంటి మంచి క్లాసిక్ హిట్ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై మంచి అభిప్రాయాలూ ఉన్నాయి..  అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకపోతుండడం కొంత అసహనానికి గురిచేస్తుంది. ఇదిగో అదిగో అంటూ జరుపుతుండడం తో ప్రేక్షకుల్లో ఈ సినిమా ఫై ఆసక్తి కూడా తగ్గుతూ వస్తుంది.

నవంబర్ 1 నుంచి తమిళనాడులో థియేటర్లు తెరుస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడీ వాయిదా డిస్ట్రిబ్యూటర్లకు సంతోషం కలిగించేదే అయినా ఇది డిజిటల్ లో తప్ప సినిమా హాళ్లలో వచ్చే అవకాశం లేనట్టే. ప్రైమ్ ముందస్తుగా చేసుకునే ఒప్పందాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి లేట్ అయినా సరే ఆకాశం నీ హద్దురాని చిన్నితెరమీద చూడాల్సిందే. వాయిదా గురించి ఒక ఓపెన్ లెటర్ లో షేర్ చేసుకున్న సూర్య ఈ పరిణామం వల్ల తానెంత బాధ పడ్డాడో వివరించాడు. అక్టోబర్ ని మంచి స్టార్ హీరో సినిమాతో ముగిద్దామని ఎదురు చూసిన మూవీ లవర్స్ కు ఇంకొన్ని రోజులు ఎదురు చూపులు తప్పవు



మరింత సమాచారం తెలుసుకోండి: