ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి
కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ‘బాహుబలి’ కి ఏకంగా 5 ఏళ్ళు కేటాయించాడు ప్రభాస్. అలాంటి టైం లో ఏ హీరో అంత ఓపికగా ఉండడు అనే చెప్పాలి.అదే సమయంలో 5,6 సినిమాలు చేసుకున్నా 100 కోట్ల వరకూ సంపాదించుకునే వాడు ప్రభాస్. కానీ ఎంతో డెడికేషన్ తో ఆ ప్రాజెక్ట్ చేసి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ‘సాహో’ విషయంలో కూడా ఇలాగే చేశాడు. ఇచ్చిన మాట కోసం ఓ కుర్ర డైరెక్టర్ సుజీత్ తో ఈ భారీ సినిమా చేసాడు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా భారీ కలెక్షన్లు రాబట్టి ప్రభాస్ స్టార్ డం ఏంటనేది ప్రూవ్ చేసింది.


ఈ 17 ఏళ్ళ ప్రభాస్ కెరీర్ లో.. మరే హీరోకి సొంతం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్ కు దక్కింది. కేవలం ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ప్రభాస్ అంటే చాలా ఇష్టపడతారు. అందుకే అతన్ని సెలబ్రిటీలు డార్లింగ్ అంటే… చాలా మంది ఆర్టిస్ట్ లు టాలీవుడ్ ‘రేలంగి మావయ్య’ అంటుంటారు. ఇక ప్రభాస్ కు సంబందించిన రేర్ అండ్ అన్-సీన్ పిక్స్ కొన్ని చూద్దాం రండి..!



మరింత సమాచారం తెలుసుకోండి: