అవునూ.. రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా సినిమా "రాధే శ్యామ్". ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అంటూ ఓ టీజర్ రిలీజ్ చేశారు. అది చూసిన కొందరు ఇది కూడా కాపీ అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే ఇంతకీ ఏంటి ఆ కాపీ వివాదం? ఏ సినిమా నుండి కాపీ కొట్టారు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే..  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా "రాధే శ్యామ్". "జిల్" మూవీ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగం కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ఈ మోషన్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. రైలు ప్రయాణంలో రోమియో-జులియేట్.. సలీం-అనార్కలీ.. దేవదాసు-పార్వతీ వంటి అమర ప్రేమికుల బొమ్మలను చూపిస్తూ ఈ చిత్రం 'విక్రమాదిత్య - ప్రేరణ'ల ప్రేమ కావ్యంగా రూపొందుతోందని హింట్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే..  ఇప్పుడు "రాధే శ్యామ్" మోషన్ పోస్టర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంటర్నెట్ - సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఫిలిం మేకర్స్ ఎంతగా క్రియేటివిటీ చూపిస్తున్నా కంపేరిజన్స్ మాత్రం తప్పడం లేదు. తాజాగా విడుదలైన 'రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ కి ఒరిజినల్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రేమికుల జంట ట్రైన్ డోర్ వద్ద వేలాడుతూ గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నట్లు ఆ పోస్టర్ లో కనిపిస్తోంది. ఇప్పుడు "రాధే శ్యామ్" పోస్టర్ లో కూడా ప్రభాస్ - పూజా హెగ్డే కూడా అలానే ట్రైన్ కి వేలాడుతూ కనిపించారు. కాకపోతే ఇక్కడ ముద్దు పెట్టుకోకుండా ఒకరినొకరు చూసుకుంటున్నారు. ప్రస్తుతం రెండు పోస్టర్స్ ని జత చేసి నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినపుడు కూడా దాన్ని వరుణ్ తేజ్ "కంచె" మూవీ ఫస్ట్ లుక్ తో పోల్చారు. అప్పుడు కూడా ఇలాగే కాపీ అనే ట్రోల్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: