సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి ఇద్దరు కలిసి చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ఇప్పటికి రికార్డులు కొడుతూనే ఉంది. బాక్సాఫీస్ పై వసూళ్ల హంగామా చేసిన ఈ సినిమా బుల్లితెర మీద మంచి క్రేజ్ తెచ్చుకుంది. జెమిని టివిలో టెలికాస్ట్ అయిన సరిలేరు నీకెవ్వరు మొదటి సారి 23.4 రేటింగ్స్ తో టాప్ 3లో నిలిచింది. ఆ తర్వాత రెండోసారి టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు 17.4 రేటింగ్ వచ్చింది.

ఇక థర్డ్ టైం కూడా జెమిని టివిలో ప్రసారమైన ఈ సినిమా మూడవసారి కూడా 12.55 రేటింగ్స్ తెచ్చుకుంది. లాస్ట్ వీక్ జెమినిలో టెలికాస్ట్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి రేటింగ్స్ తెచ్చుకుంది. ఓ పక్క ఐపిఎల్ సీజన్ నడుస్తున్నా మహేష్ సినిమా 3వ సారి టెలికాస్ట్ అయ్యి కూడా రికార్డ్ రేటింగ్స్ తెచ్చుకుంది. థియేటర్లు బంద్ అవడం ఇందుకు ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.

ఇక మహేష్ నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. సినిమాలో మహేష్ మాస్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాతో కూడా మహేష్ మరో రికార్డ్ కొడతాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూడు సినిమాలతో మహేష్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇక సర్కారు వారి పాటతో డబుల్ హ్యాట్రిక్ కు షురూ చేస్తున్నాడు సూపర్ స్టార్.                                               

మరింత సమాచారం తెలుసుకోండి: