ట్రెయిన్ ఎపిసోడ్స్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ కనిపించే దృశ్యాలు సినిమా కథను టర్న్ చేస్తుంటాయి.అందులోనూ రీల్ లో రైల్ సీన్ అంటే ఓ ఎమోషన్ ను క్యారీ చేయడమే. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ టీజర్ సమ్ థింగ్ స్పెషల్ గా అనిపించింది. సినిమా లవ్ థీమ్ తోనే సాగుతుందని అర్ధమైపోయింది. దీనికి ట్రెయిన్ ఎపిసోడ్ ను బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం ప్రత్యేకమనుకోవాలి. షోలే నుంచి డిడిఎల్ వరకు  ట్రెయిన్ ఎపిసోడ్స్ బాలీవుడ్ సినిమాను కొత్త ట్రాక్ లోకి తీసుకుపోయాయి. అలాంటి థీమ్ తోనే ఈ సినిమాను గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలిసిపోతుంది. డిడిఎల్ లో షారుక్ ,కాజల్ మధ్య నడిచిన ట్రెయిన్ జర్నీ సీన్స్ సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి.

ట్రెయిన్ ఎపిసోడ్స్ తో లవ్ కెమిస్ట్ర్రీని రన్ చేసే కాన్సెప్ట్ బాలీవుడ్ వారు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ... సౌత్ లో అరవ దర్శకులు ఇందుల్లో పీక్స్ కు వెళ్లారు. సిందూరపువ్వుతో మొదలు ప్రేమలేఖ వరకు లవ్ ట్రాక్ ఎప్పుడూ స్పెషలే. ట్రెయిన్ కదులుతుండగా సాడే ఆ ప్రేమ కావ్యాలు ఆడియన్స్ కు మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంటాయి.

షారుక్ లాంటి వాడు డిడిఎల్ తో వచ్చిన గుర్తింపును మరిచిపోలేక చెన్నై ఎక్స్ ప్రెస్ పేరుతో ఓ ఫిలిం చేశాడు. ఇందులో కూడా డిడిఎల్ మాదిరిగా ట్రెయిన్ ఎపిసోడ్స్  ను రిపీట్ చేశాడు. అవి వర్కవుట్ అయ్యాయి. అంతేకాదు లుంగీడాన్స్ ను ప్లాట్ ఫారమ్ లపై చిత్రీకరించి సినిమాను కమర్షియల్ గాను సక్సెస్ చేశాయి.

తెలుగులో ట్రెయిన్ ఎపిసోడ్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన సినిమాలలో చాలావరకు సక్సెస్ అయ్యా యి. కానీ సినిమాలో మెజారిటీ పార్ట్ ట్రెయిన్ లో సాగినప్పటికీ అంతగా వర్కవుట్ కాని సినిమాగా ఒకరినొకరు సినిమా మనకు గుర్తుండిపోతుంది. ఇందులో ప్రేమ విరహాన్ని అద్భుతంగా చూపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: