ప్రభాస్‌కు నిన్నటితో 41 ఏళ్లు నిండిన సంగతి తెలిసిందే. నిన్న అయన పుట్టిన రోజు కావడంతో సినిమా ఇండస్ట్రీకు చెందిన సెలబ్రిటీలు, అభిమానులు, స్నేహితుల పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా అంతా నిండి పోయింది. అందరి విషెస్ సంగతి పక్కన పెడితే అనుష్క చెప్పిన విషెస్ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈయన అనుష్క శెట్టితో నాలుగు సినిమాలలో స్క్రీన్‌ పంచుకున్నారు. కానీ ఎందుకో ఈ ఇద్దరి మధ్య గట్టి బాండ్ ఏర్పడింది.

ఇక విషయానికి వస్తే ఆమె నిన్న చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ పుప్సు .. రాధే శ్యామ్ యొక్క ఫీల్ ని ఈ లుక్ ని పూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఈ హృదయపూర్వక పోస్ట్‌ లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటా అంటే అనుష్క మన పాన్-ఇండియన్ సూపర్ స్టార్‌ ప్రభాస్ ని ‘పుప్సు’ అని సంభోదించడమే.

ఈ లెక్కన పుస్సూ అనేది ప్రభాస్ ముద్దు పేరు అని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె ఒక్కతే ఈ పేరుతొ పిలుస్తుందా లేక అయన ముద్దు పేరు ఇదేనా అనే చర్చ మొదలయింది. ఇక ప్రభాస్ మూడు సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉండగా అనుష్క ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఆమె రెండు సినిమాలు ఒప్పుకున్నానని చెబుతోంది కానీ ఆ సినిమాలు ఏమిటనే విషయం మీద క్లారిటీ ఇవ్వడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: