మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల లాక్ డౌన్ తరువాత రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ అల్లూరి పాత్ర యొక్క ఫస్ట్ లుక్ టీజర్లకు ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది.

అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు ఇతర భాషల నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కొమరం భీం ఫస్ట్ లుక్ టీజర్ నిన్న యూట్యూబ్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ టీజర్ లో ఎన్టీఆర్ అదిరిపోయే యాక్టింగ్, రామ్ చరణ్ వండర్ఫుల్ వాయిస్ ఓవర్, కీరవాణి ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోరు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ వెరసి టీజర్ ని ఎంతో సక్సెస్ చేసాయి.

కాగా ఈ టీజర్ రిలీజ్ అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ పై ప్రేక్షకుల్లో, అలానే మెగా, నందమూరి ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. ఇకపోతే నిన్న రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రస్తుతం అన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో దూసుకుపోతుండగా, డివివి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ లో ఇప్పటికే 16 మిలియన్లకు పైగా వ్యూస్ ని అలానే 927కె లైక్స్ ని దక్కించుకుంది. మరికొన్ని గంటల్లో ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ అందుకోనుందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఇది నిజంగా టాలీవుడ్ చరితలో ఒక గొప్ప రికార్డు అని అంటున్నారు పలువురు విశ్లేషకులు. మరి కొమరం భీం టీజర్ ఈ రికార్డ్ ని ఎంతసేపటిలో అందుకుంటుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: