కింగ్ నాగార్జున ప్రస్తుతం హిమాలయాలలో తన తదుపరి చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ లో ఉన్నాడు. ఈరోజే ఆయన దాని గురించి ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేసాడు. ఈ నటుడు రాబోయే 21 రోజులు అక్కడే ఉండి ఈ సినిమా కోసం షూట్ చేయబోతున్నాడట. దీంతో ఈ ఈ సమయంలో వేరొకరు కనీసం 2 వారాల పాటు అయినా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ను హోస్ట్ చేయవలసి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, సమంతా అక్కినేని తన మామ లేనప్పుడు, బిగ్ బాస్ యొక్క ఈ 2 వారాల వీకెండ్ ఎపిసోడ్స్ ని హోస్ట్ చేయనున్నారు.

ఒక వేళ షూటింగ్ షెడ్యూల్ విస్తరించినట్లయితే, ఆమె నాగార్జున కోసం మరో ఒకటి రెండు వారాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. దాదపుగా ఆమె హోస్ట్ చేయడం అయితే ఫిక్స్. అయితే ఇప్పుడు, సమంతా హోస్ట్ చేయబోయే దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు ఆర్‌ఎక్స్ 100 జోడీ కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ ఓపెనింగ్ ఫీట్‌ గా డ్యాన్స్ చేసి అలరించనున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

 వారి డ్యాన్స్ ని స్పెషల్ గా, అత్యంత సెక్సీగా ప్లాన్ చేసారని అంటున్నారు. అలానే ఈ వారానికి ఎలిమినేషన్ కూడా ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే నెగటివ్ ఉన్న కారణంగా ఈ వరం ఎలిమినేషన్ చేయకుండా ఎవరో ఒక ఎలిమినేట్ అయిన కంటేస్టంట్ ని లోపలి పంపే అవకాశం ఉందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: