పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ తరువాత పూర్తిగా తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమైన పవన్ కళ్యాణ్, ఆపై రెండేళ్ల పాటు రాజకీయాల్లోనే కొనసాగారు. ఇక ఎట్టకేలకు వకీల్ సాబ్ సినిమా ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైన పవన్, ఇప్పటికే దాని షూటింగ్ చాలావరకు పూర్తి చేసారు. అలానే దానితో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేస్తున్నారు. ఇక వకీల్ సాబ్ తో పాటు క్రిష్ సినిమా కూడా అతి త్వరలో నెక్స్ట్ షెడ్యూల్స్ జరుపుకోనున్నాయి. వకీల్ సాబ్ లో పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న పవన్, క్రిష్ సినిమాలో వజ్రాల దొంగ పండగల సాయన్న అనే పాత్ర పోషిస్తున్నట్లు టాక్.

కాగా వకీల్ సాబ్ నుండి ముందుగా మగువా మగువా అనే పల్లవి తో సాగె లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందన రాబట్టగా, ఇటీవల పవన్ బర్త్ డే సందర్భంగా ఈ  సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కాగా అవి రెండు కూడా సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెంచాయి. ఇకపోతే ఈ సినిమా టీజర్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మిగతా అందరు హీరోల సినిమాలకు సంబందించిన అప్ డేట్స్ వస్తుంటే తమ హీరోకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ రాకపోవడం పై వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా నిర్మాతలపై కొంత అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి దసరా పండుగ కానుకగా టీజర్ కు సంబంధించి అప్ డేట్ రానుంది అంటూ ఇటీవల కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి దసరా పండుగ నాడు కూడా పవన్ ఫ్యాన్స్ కు ఉపవాసం తప్పేలా లేదని, అంటే ఆ రోజున వకీల్ సాబ్ టీజర్ కు సంబంధించి ఎటువంటి అప్ డేట్ రాదని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ఒకవేళ కనుక నిజం అయితే మాత్రం, ఇది పవన్ ఫ్యాన్స్ కు బాగా నిరాశ కలిగించే వార్త అని చెప్పకతప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: