నేడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈశ్వర్ తో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలెట్టిన ప్రభాస్, ఆపై వర్షం, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, బుజ్జిగాడు, బిల్లా, మిర్చి వంటి సినిమాల సూపర్ సక్సెస్ లతో ఎందరో ప్రేక్షకుల మనస్సులో గొప్ప పేరుని స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక తనకు నటనలో పెద్దనాన్న కృష్ణంరాజు ఎంతో ఆదర్శం అని ఎప్పుడూ చెప్తూ ఉండే డార్లింగ్ ప్రభాస్ తో కొద్దిసేపు మాట్లాడితే చాలు ఎంతటివారైనా ఆయనకు స్నేహితులుగా మారిపోతారని ఆయన గురించి తెలిసిన ఎందరో ప్రముఖులు చెప్తూ ఉంటారు.

ఇక ఇటీవల దర్శకదిగ్గజం రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక సినిమాలైన బాహుబలి రెండు భాగాలతో హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించి ఎవరికీ అందనంత గొప్ప క్రేజ్ ని దక్కించుకున్నారు ప్రభాస్. ఆ తరువాత సాహో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఇక నేడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు అభిమానులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించగా పలువురు ప్రేక్షకులు, అభిమానులు, సినిమా ప్రముఖులు ఆయనకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, మొదలుకుని ఎందరో టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషలకు చెందిన ప్రముఖులు, అలానే నిర్మాణ సంస్థలు ఆయనకు బర్త్ డే విషెస్ ని తెలియచేసాయి. ఈ విధంగా నేడు ఉదయం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాలు అన్ని కూడా డార్లింగ్ ప్రభాస్ నామస్మరణ తో మారుమ్రోగాయి అనే చెప్పాలి. మరోవైపు నేడు ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: