ఇప్పుడంతా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ మీద పడ్డారు. అటు సినిమాలు తీసే వాళ్ళ నుంచి ఇటు చూసే ఆడియన్స్ వరకూ ప్రతీ ఒక్కరూ ఈ డిజిటల్ ధియేటర్స్ పై పడ్డారు. ఒకే టికెట్ మీద వంద సినిమాలు అన్న కాన్సెప్ట్ ను తీసుకొచ్చిన ఈ డిజిటల్ ధియేటర్స్ కరోనా వచ్చాక బాగా ఊపందుకున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరూ వీటికి బాగా అడిక్ట్ అయిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ ఒకదాని తరువాత ఒకటి వరుసపెట్టి ఆడించేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా వెబ్ సిరీస్ లకైతే మాంచి గిరాకీ ఉంది. రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ వంటి జోనర్స్ నుంచి వచ్చే వెబ్ సిరీస్ లంటే జనం పిచ్చెక్కిపోతున్నారు. దీంతో హీరోలు, హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ, నిత్యామీనన్ వంటి వారు వెబ్ సిరీస్ లలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ లిస్టులో చేరిపోయారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన "లైవ్ టెలికాస్ట్" అనే హారర్ వెబ్ సిరీస్ లో కాజల్ నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే లార్జెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 

దీనికి సంబంధించిన పోస్టర్ ను కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో కాజల్ సీరియస్ లుక్ లో కనిపించగా, వైభవ్, ఆనంది భయపడుతున్నట్టు కనబడుతున్నారు. నిజానికి పోస్టర్ లో కాజల్ ను చూస్తే భయం వేయడం లేదు. అయినా ఇంత అందంగా ఉంటే ఎవరైనా భయపడతారా? ఏమో ఇప్పటివరకూ నర్తించి, నవ్వించి, కవ్వించి, కనువిందు చేసిన చందమామ ఈ వెబ్ సిరీస్ తో భయపెడతారేమో. పుస్తకం మీద ఉన్న ఫోటోని చూసి లోపల పేజీలు ఎలా ఉంటాయో అంచనా వేయకూడదంటారు కదా. కాబట్టి వెబ్ సిరీస్ చూశాక ప్రేక్షకులే నిర్ణయిస్తారు. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటిన కాజల్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ మీద కూడా తన హవా కొనసాగించనున్నారన్నమాట. ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న "ఆచార్య", మంచు విష్ణు హీరోగా వస్తున్న "మోసగాళ్ళు", కమల్ హాసన్ నటిస్తున్న "ఇండియన్ 2" సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: