హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే టాప్ పొజిషన్ లకు వెళ్లిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే ఏటా వందల మంది హీరోయిన్స్ గా తెరకు పరిచయం అవుతున్నా ఒకరో ఇద్దరో కొంచెం ఫేం తెచ్చుకుని నిలబడగలుగుతారు. అలాంటి వాళ్ళలో పూజా హెగ్దే ఒకరు. అసలు ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈమె ఇప్పుడు తెలుగులోనే కాక సౌత్ తో పాటు హిందీలో కూడా తన సత్తా చాటుతోంది. నాగ చైతన్య ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా ఒక్కో సినిమా హిట్ కొడుతూ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించేసింది.

ఎన్టీఆర్‌ తో అరవింద సమేత, మహేష్‌ బాబు కలసి మహర్షి, తాజాగా బన్ని సరసన అల వైకుంఠపురంలో సినిమాలో నటించి హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. అలా వరుస హిట్లతో జోష్ మీద ఉన్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తోన్న ఈ సినిమా నుండి ఒక మోషన్ టీజర్ కూడా రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ అరుదైన రికార్డ్ సాధించింది.

 ఇప్పటికి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించింది. ఇది నిజంగానే రేర్ ఫీట్. ఆమె నిజానికి జూలై 16న 11 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించగా మూడు నెలల లోనే ఆమె మరో మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించింది. 11 మిలియన్ ఫాలోవర్స్ వచ్చినప్పుడు పూజా తన కాళ్ళను యోగా భంగిమలో పైకి ఎత్తి వాటిని 11గా చూపించింది. ఇప్పుడు ఎలాంటి యోగ భంగిమ పెడుతుందో ? చూడాలి మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: