పూరీ, విజయ్ దేవరకొండలు పాన్ ఇండియా స్ట్ర్రాటజీని పూర్తిగా మార్చేయాలని చూస్తున్నారు. కంటెంట్ బాగుంటే చాలు... వందకోట్ల బడ్జెట్ అసలు అవసరమే లేదంటున్నారు. సౌత్ లో ఎవరూ టచ్ చేయని నయా స్ట్రాటజీతో అడుగులు ముందుకేస్తున్నాడు ఫైటర్.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ .. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో పాన్ ఇండియా ఫిలిం "ఫైటర్" ను షురూ చేశారు. ఇందులో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ హీరో కావడంతో సినిమాకు మాంచి జోష్ వచ్చింది. స్టోరీని మెటీరియలైజ్ చేయడంలో పూరీ ఎప్పుడూ ముందుంటాడు కాబట్టి ఈ ఫిలింపైనా మార్కెట్లో మంచి అంచనాలున్నాయి.

ఫైటర్ ఫిలింతో పాన్ ఇండియా కాన్సెప్ట్ లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను పూరీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ కావడంతో అందరూ వందకోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తారేమో అనుకున్నారు. కట్ చేస్తే జస్ట్ 70కోట్లతోనే సినిమాను లాగేస్తున్నారని తెలుస్తుంది. జస్ట్ 70కోట్లతో  తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిలిం నిర్మాణం చేయడం అంటే మాములు విషయం కాదు. అందులోనూ కరన్ జోహార్ లాంటివారు హిందీ వెర్షన్ కు భాగస్వామ్యం కావడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి.

 ఫైటర్ పరంగా పూరీ, విజయ్ దేవరకొండలు చేస్తున్న అటెంప్ట్ ఏమిటంటే.. పాన్ ఇండియా అంటే వందకోట్ల ముచ్చట అనే మ్యాటర్ ను మార్కెట్ మర్చిపోయేలా చేయాలని చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో జస్ట్ 50 నుంచి 70కోట్ల మధ్య కూడా నిర్మాతలను కాపాడుతూ టోటల్ సిస్టమ్ ను చేంజ్ చేసే కంటెంట్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలను చేయొచ్చని నిరూపించబోతున్నారు. దీనికి తోడు ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ అంటే విజయ్ దేవరకొండ అస్సలు ఒప్పుకోవడం లేదు. బాలీవుడ్ కూడా మనం రెగ్యులర్ గా చూసే పరిశ్రమలలో అది కూడా ఒకటి అంటూ ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: