ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి రిలీజైన కొమరం భీమ్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు కొడుతుంది. ఇప్పటికే 16 మిలియన్ వ్యూస్ తో సత్తా చాటగా లైక్స్ లో 1 లక్షలు దగ్గరలో ఉంది కొమరం భీమ్ టీజర్. సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు.

సినిమా నుండి రాం చరణ్ అల్లూరి సీతారామరాజు టీజర్ కొన్నాళ్ల క్రితం రిలీజ్ అవగా లేటెస్ట్ గా గురువారం రోజు కొమరం భీమ్ టీజర్ వచ్చింది. ఈ టీజర్ నందమూరి ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. కొమరం భీమ్ టీజర్ ప్రస్తుతం 993k లైక్స్ తో దూసుకెళ్తుంది. ఇది ఎన్.టి.ఆర్ స్టామినాను ప్రూవ్ చేస్తుంది. తప్పకుండా ఈ టీజర్ సినిమాపై అంచానాలను డబుల్ చేసిందని చెప్పొచ్చు.

బాహుబలి తర్వాత రాజమౌళి నుండి ఎలాంటి సినిమా ఆశించారో అలాంటి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు జక్కన్న. సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని ఈ రెండు టీజర్లు చూస్తేనే అర్ధమవుతుంది. తప్పకుండా సినిమా మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోర్స్ నటిస్తున్నారు. 2021 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రాబోతుంది. తప్పకుండా ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందని తెలుస్తుంది.  ఈ సినిమాను కూడా బాహుబలి రేంజ్ లో భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.    

                                                                         



మరింత సమాచారం తెలుసుకోండి: