మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నా సరైన హిట్ రాక కెరియర్ లో వెనకపడ్డది. తెలుగులో అమ్మడికి రెండు స్టార్ ఛాన్సులు వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న అనుపమ తెలుగులో కొద్దిగా బ్రేక్ తీసుకుని రెండు ఛాన్సులు అందుకుంది. అందులో ఒకటి సుకుమార్ ప్రాజెక్ట్ అవడం విశేషం.

సుకుమార్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ సినిమాలో అనుపమ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా లవ్ స్టోరీతో వస్తుంది. ఈ సినిమాను కుమారి 21ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలు చేస్తున్నా చేయకపోయినా సోషల్ మీడియాలో అనుపమ హంగామా ఓ రేంజ్ లో ఉంది. అందుకే అమ్మడికి ఫాలోవర్స్ క్రేజీగా ఉంటారు. ఇక లేటెస్ట్ గా అమ్మడు ఇన్ స్టాగ్రాం లో శారీ లుక్ లో అలరించింది. అదేదో సినిమాలో లుక్ లా అనిపిస్తున్నా శారీలో దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్న పిక్ కు క్యాప్షన్స్ ఇవ్వండని అంటుంది అనుపమ.

అమ్మడు పెట్టిన ఈ పొస్ట్ కు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అందం, అభినయం రెండు ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. తెలుగులో అనుపమకి ఫాలోయిన్ బాగానే ఉన్నా ఇంకా ఆమె యువ హీరోల సరసన మాత్రమే నటిస్తుంది. స్టార్ హీరోలతో ఒక్క హిట్టు పడినా అమ్మడి దశ తిరిగిపోతుంది. మరి అనుపమ పరమేశ్వరన్ కు ఆ లక్కీ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి.    

                                                   


మరింత సమాచారం తెలుసుకోండి: