సినీ పరిశ్రమకు చెందిన వారి గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇందులో వారి రోజువారీ జీవనమైనా, సినిమాల విశేషాలైనా, వ్యక్తిగత విషయాలైనా కావొచ్చు. ఒక్కోసారి చదవడానికి మాత్రమే ఆ వార్తలు ఉంటే.. ఒక్కోసారి చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. అటువంటి వార్తే ఒకటి ఇటివల సీనియర్ నటి, హీరోయిన్ విజయలక్ష్మి గురించి కోలీవుడ్ లో ఆసక్తికరంగా రౌండ్ అవుతోంది. తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో హీరో వేణుకు జోడీగా నటించిన భామే విజయలక్ష్మి. ప్రస్తుతం ఆమెపై చెన్నైలో పోలీస్ కంప్లైంట్ నమోదవడం తీవ్ర చర్చనీయాంశం అయింది.

ఆమధ్య విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న విజయలక్ష్మిపై ఆమె నివసిస్తున్న ఇంటి ఓనర్ ఇప్పుడు పోలిస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఫిబ్రవరి నుంచి ఆమె ఇంటి అద్దె కట్టడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఇప్పటివరకూ ఆమె 3లక్షలు బకాయి ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆమెను విచారించబోతున్నారని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ విజయలక్ష్మి వార్తల్లో నిలిచింది. అయితే.. దీనిపై విజయలక్ష్మి నుంచి ఎటువంటి స్పందనా రాలేదని తెలుస్తోంది. ఆమె స్పందిస్తేనే ఈ వార్తల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

గతంలో తనను రాజకీయ నేతగా మారిన సినీ నటుడు వేధిస్తున్నాడంటూ విజయలక్ష్మి వార్తల్లో నిలిచింది. వారం రోజులపాటు ఆ వార్త సంచలనం రేపింది. ఆ మనోవేదనతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు కూడా పేర్కొంది. దీంతో అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. ఇప్పుడు మళ్లీ అద్దె చెల్లించడం లేదంటూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం విజయలక్ష్మి వ్యవహారం తమిళ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. తమిళంలో గతంలో పలు సినిమాల్లో నటించింది. అనంతరం టీవీ సీరియల్స్ లోనూ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: