కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ఇండియన్ 2 సినిమా ని మొదలుపెట్టాడొ తెలీదు కానీ ఆదినుంచి ఈ సినిమాకి అన్ని అడ్డంకులు వస్తున్నాయి.. మొదట్లో నిర్మాతలకు, శంకర్ చెడింది.. ఆ తర్వాత అన్ని సమస్యలు సద్దుమణిగి సినిమా షూటింగ్ మొదలైంది.. ఆ తర్వాత సినిమా లో జరిగిన ఓ ప్రమాదం లో ఇద్దరు సినీ కార్మికులు చనిపోయారు.. దాంతో ఈ సినిమాలోని విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి.. కరోనా వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇప్పటివరకు తిరిగి ప్రారంభం కాలేదు.. అన్ని సినిమాలు చక చక షూటింగ్ కి వెళ్లిపోతుంటే శంకర్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు..

తాజా సమాచారం మేరకు ఈ సినిమా నవంబర్ లో మొదలు అవుతుందని అంటున్నారు.. ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా హీరోలు శింబు, సిద్ధార్థ్ లు ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇక అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఇండియన్ 2కి సంబంధించి ఒక హాట్ టాక్ చెన్నై వేదికగా సాగుతోంది. దాని ప్రకారం నిర్మాణ సంస్థ లైకాకు దర్శకుడు శంకర్ కు ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పందం కుదరలేదట.

ముందుగా అన్ని కాంప్రోమైజులు పోనూ ఇండియన్ 2కు అనుకున్న బడ్జెట్ సుమారు 200 కోట్లు. దానికన్నా ముందు శంకర్ ఇచ్చిన ఎస్టిమేషన్ నాలుగు వందల కోట్ల దాకా ఉందట. అయితే 2.0కు అంత ఖర్చు పెట్టినా నష్టాలు వచ్చిన నేపథ్యంలో దీన్ని మాత్రం తగ్గించే చేయాలని లైకా చెప్పడంతో శంకర్ రాజీ సూత్రం అవలంబించారు. అయితే ఇప్పుడు అందులోనూ కోత పెట్టే ప్రతిపాదన రావడంతో శంకర్ అందుకు ఇష్టపడటం లేదని సారాంశం. క్రేన్ యాక్సిడెంట్ జరిగాక షూటింగ్ చాలా రోజులు ఆగిపోవడం, నష్టపరిహారాలు, కోర్టు వ్యవహారాలు తదితరాలకు అదనంగా ఖర్చు కావడం వగైరా కారణాలు లైకాకు భారంగా మారాయని చెబుతున్నారు. అందుకే ప్లాన్ చేసుకున్న దానికన్నా తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: