అక్కినేని నాగార్జున బిగ్ బాస్  షో కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.. గత రెండు సీజన్ లు గా నాగార్జున సక్సెస్ ఫుల్ గా ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, అదే సమయంలో అయన వైల్డ్ డాగ్ సినిమా కూడా చేయడం ఇప్పుడు కొంత సమస్యగా మారింది.. చివరగా నాగ్ గత వారం ఎపిసోడ్లలో కనిపించారు. ఈ వారం కొత్త హోస్ట్‌ను చూడబోతున్నాం తెలియబోతుంది. ఆ బాధ్యతను రోజాకు అప్పగించినట్లు వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో చూడాలి.

ఇక ‘వైల్డ్ డాగ్’ విషయానికొస్తే ‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాలతో రచయితగా మంచి పేరు సంపాదించిన సాల్మన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో నాగ్ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం నాగార్జున  మోస్ట్ డేంజరస్ ప్లేస్‌ల్లో ఒకటైన రోహ్‌తాంగ్ పాస్‌లో కి వెళ్లారు.. అక్కడ  సముద్ర మట్టానికి 3980 మీటర్లు, 13 వేల అడుగుల ఎత్తులో షూటింగ్ జరుపుకోనున్నారు..ముకలు కొరికే చలి అంటారు కదా.. అలాంటి ప్రాంతమే ఇది. నవంబరు నుంచి మే వరకు ఈ ప్రాంతాన్ని మూసి వేస్తారు. ఆ ప్రాంతంలో మొత్తం గడ్డ కట్టుకుపోయి ఉంటుంది.

వైల్డ్ డాగ్ టీమ్ ఇక్కడ ఈ సినిమా కోసం మొత్తం 21 రోజులు ఉండనుంది..ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా తెలిపారు.. తిరిగొచ్చి అందరినీ కలుస్తానని అన్నాడు. వచ్చే నెల నుంచి ఇక్కడ షూటింగ్ సాధ్యం కాదు కాబట్టే నాగ్.. ‘బిగ్ బాస్’ షోను వదిలిపెట్టి అక్కడికి వెళ్లారు. ఆయన లేని నాలుగు వారాల్లో వేరే హోస్ట్ ఈ బాధ్యతలు చూడనున్నారు. ఏదేమైనా నాగార్జున ఈ రెండు పడవల ప్రయాణం అంతమంచిది కాదని అంటున్నారు.. గత సీజన్ లో కూడా నాగార్జున ఒక వారం డుమ్మా కొట్టారు.. ఇప్పుడు మాత్రం రెండు వారలు డుమ్మా కొట్టడం అభిమానులకు నచ్చడం లేదు..





మరింత సమాచారం తెలుసుకోండి: