బిగ్ బాస్ లో రచ్చ షురూ అయింది.. నిన్న మొన్నటి దాకా రొమాన్స్ , ఎఫైర్స్ కాస్త ఎక్కువగా జరిగేవి.. ఇప్పుడు మాత్రం రూట్ మార్చారు..బిగ్ బాస్ హౌస్ లో సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. అందులో కూడా ఎవరికీ ఏది కావాలో అది చేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. నిన్నటి వరకు జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో హారిక మసాజ్ ను సొహైల్ బాగా ఎంజాయ్ చేశాడు. చివరికి అవినాష్ కెప్టెన్ అయ్యాడు..అయితే, శుక్రవారం ఎపిసోడ్ కూడా ఇదే విధంగా సాగింది. బిగ్ బాస్ బ్లాక్‌బస్టర్ అని ఒక సినిమా తీసే టాస్క్‌ను ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చారు.



ఈ టాస్క్ లో భాగంగా ఎవరికీ తగ్గట్లు వాళ్ళు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు.. కథ ఒకలా ఉంటే వీళ్ళు చేసేది మరోలా ఉంది. అమ్మా రాజశేఖర్ మాస్టర్ ఎప్పటిలాగే కొరియో గ్రాఫర్.. ఐటమ్ సాంగ్ చేయించడానికి సిద్దం అయ్యారు. డ్యాన్స్ చేసే టప్పుడు కేవలం కొరియోగ్రాఫర్ ఉంటే చాలు , డైరెక్టర్ అవసరం లేదు అంటూ అనడంతో అభిజిత్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావ్. నేను ఒకటి అడుగుతుంటే నువ్వు వేరేలా మాట్లాడుతున్నావ్. ఉదయం నుంచీ చూస్తూనే ఉన్నా.. ఓవర్ సీన్ చూపిస్తున్నావ్ నువ్వు అంటూ రాజశేఖర్ ఫైర్ అయ్యారు.. ఇది కాస్త ఎక్కువ కావడంతో కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది.



ఇలా కాస్త గొడవలతో మొదలైన ఈ చర్చలు ముగిశాయి. ఐటమ్ డాన్సర్స్ హారిక, సోహెల్ కాస్త ఉపసమనాన్ని అందించారు. ‘కెవ్వు కేక’ సాంగ్‌కి వీరిద్దరితో కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ రిహార్సిల్స్ చేయించారు. హారిక కాస్త కన్‌ఫ్యూజ్ అయినా మంచి మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపింది... సొహెల్ కూడా కాక మీద ఉండటంతో హారికా ఇంకా రెచ్చిపోయింది. అలా ఏదోకటి చేసి సినిమాను మొత్తానికి పూర్తి చేశారు. మొత్తానికి షో కి హైలెట్ గా నిలిచింది.. మాత్రం హారిక , సొహెల్ డ్యాన్స్.. ఇప్పుడు అందరిలో టెన్షన్ మొదలైంది.. ఎలిమినేట్ ఎవరు అవుతారా అని..మొత్తానికి మోనాల్ ఖాయం అయినట్లు తెలుస్తోంది.. మరి ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: