తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన బాహుబలి సిరీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజీ నిలిచింది. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ఇండియన్‌ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసిందని చెప్పచ్చు. ఇప్పటికీ భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి 2 సినిమా మళ్ళీ థియేటర్ లో రచ్చ చేస్తోంది.

 రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 ) సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన “బాహుబలి 2 ” తో పాటు సుజీత్ దర్శకత్వంలో రూపొందిన “సాహో ” సినిమాల్ని అమెరికా, జపాన్ దేశాలలో రీ రిలీజ్ అంటే అదేనండీ స్పెషల్ స్క్రీనింగ్ లు ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ లో నటిస్తున్నారు. రాధే శ్యామ్ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సినిమాలు అన్నిటిలోనూ ప్రభాస్ ఆది పురుష్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్న ఈ సినిమాలో సీత ఎవరు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. అనుష్క మొదలు కియారా అద్వానీ దాకా చాలా మంది పేర్లు అయితే ప్రచారంలోకి వచ్చాయి కానీ. ఇంకా ఎవరినీ అయితే ఫైనల్ చేయలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: