ఈసారి దసరా పండుగకు టాప్ హీరోల సినిమాలు ఏమి విడుదల కాకపోవడంతో యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో స్టార్ హీరోల  అభిమానులు తమ హీరోలకు సంబంధించిన టీజర్ రికార్డుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ లు క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో వ్యూస్ మరియు లైక్స్ రికార్డుల కోసం స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా యాతన పడుతున్నారు.  


దేశ వ్యాప్తంగా పేరు ఉన్న బాలీవుడ్ హీరోలకు కూడ సాధ్యం కాని రికార్డులను తమ హీరోలకు తెచ్చిపెట్టాలని టాప్ హీరోల అభిమానులు ఈ దసరా పండుగ సీజన్ లో అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకిసంబంధించి రామరాజు ఫర్ భీమ్ వీడియోకు నందమూరి ఫ్యాన్స్ కేవలం 24 గంటలలో మిలియన్ లైక్స్ తీసుకురావాలని చాల గట్టి ప్రయత్నాలు చేసారు.


కానీ వారి ప్రయత్నాలు కేవలం 70 వేల లైక్స్ తేడాతో 24 గంటల్లో మిలియన్ లైక్స్ రికార్డ్ మిస్ అయింది. దీనితో ఆ రికార్డును తాము సాధించి తీరాలని పవన్ అభిమానులు చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా కానుకగా రేపు విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ కు అత్యధిక లైక్స్  రాబట్టడమే కాకుండా మిలియన్ లైక్స్ ను కేవలం 24 గంటల లోపు దక్కించుకుని తమ సత్తా చూపాలని పవన్ అభిమానులు ఈరోజు ఉదయం నుండి కార్యరంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.


పవన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులు తలుచుకుంటే ఈ రికార్డు సాధించడం చాల సులువని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు . పవన్ రీ ఎంట్రీ మూవీగా రికార్డులు క్రియేట్ చేయబోతున్న ఈ మూవీ టీజర్ కు కేవలం 24 గంటలలో ఒక మిలియన్ వ్యూస్ రప్పించగలిగితే జూనియర్ అభిమానులు చేయలేని పని పవన్ అభిమానులు చేసి తమ సత్తా చూపిస్తారు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: